ENGLISH

బికినీ బ్యూటీ యాక్షన్‌ షురూ కానుందట

10 February 2018-08:30 AM

ఈ మధ్య సోషల్‌ మీడియాలో బికినీలతో హీటెక్కించేసిన బ్యూటీ నికీషా పటేల్‌. తొలి సినిమాకే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. 'కొమరంపులి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తన హాట్‌ హాట్‌ అందాలతో ఆడియన్స్‌కి బాగానే ఎర వేసింది కానీ ఎందుకో ఈ పులి పిల్లను అంతగా పట్టించుకోలేదు. దాంతో కోలీవుడ్‌కి చెక్కేసింది. 

'తలైవన్‌' చిత్రంతో అక్కడ తెరంగేట్రం చేసింది. కొంచెం బొద్దుగా, ముద్దుగా ఉండే తన అందచందాలతో తమిళ తంబీలను ఎట్రాక్ట్‌ చేసింది. కానీ అక్కడ కూడా అరకొరా సినిమాలతోనే సరిపెట్టుకుంది. తెలుగుతో పోల్చితే అక్కడ ఆఫర్లు బాగానే దక్కించుకుంటోంది. కానీ తెలుగులో బిజీ అవ్వాలనేది అమ్మడి ఆశట. ఇదిలా ఉండగా, ఇటీవల సోషల్‌ మీడియాలో అమ్మడు చేసిన బికినీ షోకి మంచి రెస్పాన్సే దక్కినట్లనిపిస్తోంది. కష్టపడి బరువు తగ్గి, నాజూకు అందాల సౌందర్యాన్ని నలుగురికీ చూపించడానికి తెగ తాపత్రయపడిందీ ముద్దుగుమ్మ. 

ఎట్టకేలకు ఆ కష్టం ఫలించి, మొత్తానికి ఓ తెలుగు సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. అయితే అది యాక్షన్‌కి సంబంధించిన పాత్రట. కానీ సూపర్బ్‌గా ఉంటుందంటోంది నికీషా. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా వివరాలు పూర్తిగా తెలీదు కానీ, తనలో పైకి కనిపించే గ్లామరే కాదు, మరో ఎక్స్‌ట్రా టాలెంట్‌ కూడా ఉందంటూ ఇంట్రెస్టింగ్‌ విషయం ఒకటి చెప్పింది నికీషా. బేసిగ్గా ఈ ముద్దుగుమ్మ బాక్సింగ్‌ క్రీడాకారిణి అట. 

సో యాక్షన్‌ కథాంశాలకు తన ఫిజిక్‌ కరెక్ట్‌గా సరిపోతుందనీ, బాలీవుడ్‌లో ముద్దుగుమ్మ తాప్సీలా యాక్షన్‌ ప్రధానాంశం గల స్టోరీల్లో ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నాననీ చెబుతోంది. ఎప్పటికైనా ఆ తరహా కథల్లో నటించాలన్న తన కోరికను బయట పెట్టింది ముద్దుగుమ్మ నికీషా పటేల్‌.

 

ALSO READ: Qlik Here For The Gallery Of Nikesha Patel