ENGLISH

మాస్ట్రోగా నితిన్ ఎంట్రీ!

30 March 2021-12:31 PM

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `అంధాధూన్‌`. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకు ‘మాస్ట్రో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. న‌భా నటేష్‌ కథానాయిక. అక్క‌డ ట‌బు పోషించిన పాత్ర‌లో ఇక్క‌డ‌ తమన్నా క‌నిపించ‌నుంది. జూన్‌ 11న ప్రేక్షకులముందుకు రానుంది.

 

ఈరోజు నితిన్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో కళ్లకు నల్లటి గాగుల్స్‌ పెట్టుకొని, చేత్తో ఓ స్టిక్‌ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నారు నితిన్‌. పోస్టర్‌లో పియానోపై రక్తపు మరకలు కథపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

ALSO READ: యూ ట్యూబ్‌ని పంక్చ‌ర్ చేసిన 'వ‌కీల్ సాబ్‌'