ENGLISH

బిగ్ బాస్‌లో ఎంత గ్లామ‌రో..!

15 December 2020-14:08 PM

బిగ్ బాస్ సీజ‌న్ 4 విజేత ఎవ‌రో మ‌రి కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఈనెల 20న గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌బోతోంది. ఈసారి అతిథిగా ఎవ‌రు వ‌స్తార‌న్న విష‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. చిరంజీవి, ఎన్టీఆర్‌ల‌లో ఒక‌రు ఈ షోలో పాల్గొని, విజేత‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. బిగ్ బాస్ 4 సీజ‌న్ ఆరంభం ఎంత ఘ‌నంగా సాగిందో, ముగింపు కూడా అంతే వైభవంగా ఉండాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు.

 

ఈ షో క్లైమాక్స్ ఆద్యంతం రక్తి క‌ట్టేలా.. స్టార్ల‌ని రంగంలోకి దింప‌బోతున్నారు. నివేదా పేతురాజ్‌, మెహ‌రీన్‌, లక్ష్మీరాయ్‌... ఇలా గ్లామ‌రస్ హీరోయిన్ల‌ను ఈ ఫినాలే కోసం తీసుకువ‌స్తున్నార‌ని టాక్‌. వీళ్లంతా త‌మ ఆట పాట‌ల‌తో అల‌రించ‌డానికి రెడీ అవుతున్నార్ట‌. వీళ్లు కాకుండా.. మ‌రి కొంత మంది హీరోయిన్లు సైతం ఈ ఫినాలేలో మెర‌వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి క్లైమాక్స్ ని గ్లామ‌రెస్ గా మార్చ‌డానికి బిగ్ బాస్ టీమ్ రెడీ అవుతోంద‌న్న‌మాట‌.

ALSO READ: Nivetha Latest Photoshoot