ENGLISH

వ‌కీల్ సాబ్ పైనే ఆశ‌లు పెట్టుకుంది

16 March 2021-09:23 AM

నివేదా దామ‌స్‌.. మంచి టాలెంట్ ఉన్న పిల్ల‌. అందం మాట అటుంచితే, అభిన‌య ప‌రంగా మంచి మార్కులు కొట్టేస్తుంటుంది. త‌న పాత్ర‌ల ఎంపిక కూడా బాగుంటుంది. కాక‌పోతే.. ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద హీరోల దృష్టి త‌న‌పై ప‌డ‌లేదు. `జై ల‌వ‌కుశ‌`లో ఆ ఛాన్స్ వ‌చ్చినా - ఆ జోరు త‌ర‌వాత కొన‌సాగ‌లేదు. ఇటీవ‌ల కొన్ని ప‌రాజ‌యాలు ఆమెను మాన‌సికంగా కాస్త కృంగ‌దీశాయి. ఇప్పుడు ఓ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాల‌నుకుంటోంది.

 

పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫ‌ర్లు అందుకోవాల‌నుకుంటోంది. త‌న ఆశ‌ల‌న్నీ `వ‌కీల్ సాబ్`పైనే. ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో నివేదా ఓ కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమా హిట్ట‌యితే, త‌న కెరీర్ మ‌లుపు తిరుగుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌ది. ``పెద్ద హీరోల సినిమాలో ఛాన్సులు ఊర‌కే రావు. వ‌చ్చిందంటే నిల‌బెట్టుకోవాల్సిందే. వ‌కీల్ సాబ్ నా కెరీర్‌లో ఓ ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది`` అని న‌మ్మ‌కంగా చెబుతోంది నివేదా.

ALSO READ: Nivetha Thomas Latest Photoshoot