ENGLISH

పెళ్లిపై పెదవి విప్పిన 'జెంటిల్‌మెన్‌' బ్యూటీ

23 July 2018-12:48 PM

పెళ్లి తర్వాత చాలా మంది ముద్దుగుమ్మలు నటనలో రాణిస్తున్నారు. ఏమాత్రం తక్కువ కాకుండా మునుపటిలాగే అవకాశాలు దక్కించుకుంటున్నారు. అదే ఆలోచనలో ముద్దుగుమ్మ నివేదా థామస్‌ కూడా ఉందట. ప్రస్తుతం ఈ బ్యూటీ నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌తో నటిస్తోంది. గుహన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందుతోంది. 

ఇకపోతే తాజాగా ఎవరో ఈమెను పెళ్లిపై తన అభిప్రాయమేంటని అడిగారట. అందుకు చాలా సూటిగా సమాధానమిచ్చింది అమ్మడు. టైమ్‌ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లికీ, కెరీర్‌కి అస్సలు ముడిపెట్టను. పెళ్లి తర్వాత కూడా ఖచ్చితంగా నటిస్తాను.. అంటూ తన మనసులోని అభిప్రాయాన్ని కుండ బద్దలుకొట్టేసింది నివేదా థామస్‌. 'జెంటిల్‌మెన్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

తర్వాత ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' సినిమాలో నటించింది. మధ్యలో యాక్టింగ్‌కి కాస్త బ్రేకిచ్చి, స్టడీస్‌ కంప్లీట్‌ చేసింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌లపై దృష్టి పెట్టింది. ఇక నుండి వరస సినిమాల్లో నటిస్తానంటోంది. గ్లామర్‌పై కూడా తనకేం పెద్దగా అభ్యంతరాల్లేవనే సంకేతాలు పంపిస్తోందీ మలయాళ ముద్దుగుమ్మ. 

ఇలాంటి అభిప్రాయాలుండి, యాక్టింగ్‌ టాలెంట్‌ ఉంటే ఇక అవకాశాలకేం కొదవుండదుగా.!

ALSO READ: బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్ళిపోయిన వారికి మరో ఛాన్స్