యంగ్ టైగెర్ ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదు. RRR సినిమా తరవాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాలు చేయటానికి అన్ని భాషలకి చెందిన స్టార్ డైరక్టర్స్ ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది. రెండు పార్ట్ లుగా రానున్న ఈ చిత్రం మొదటి పార్ట్ దాదాపు పూర్తి కావచ్చింది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హిరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షెడ్యూల్ చివరి దశకి రావటంతో ఎన్టీఆర్ బాలీవుడ్ మోస్ట్ ప్రేస్టిజియస్ ప్రాజెక్ట్ 'వార్ 2' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ తరవాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఉంటుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ సలార్ పార్ట్ 2 తరవాత ఎన్టీఆర్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు, కానీ ప్రభాస్ తన ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉండటం వలన, ఎన్టీఆర్ ఫ్రీ అవటం వలన మొదట ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని నీల్ ప్లాన్ చేసాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతోంది. దీనికి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ పేర్కొన్నారు. హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయినట్లు కూడా టాక్. ఇప్పుడు ఈ మూవీ కి సంభందించి ఇంకొక న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. సుమారు 130 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ తీసుకున్న పేమెంట్ కి ఇది చాలా ఎక్కువని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. RRR తరవాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారటం, వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. దీనికి అనుగుణంగానే ఎన్టీఆర్ పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది.