ENGLISH

ఆందోళనలో ఎన్టీఆర్ ఫాన్స్... ఇంతకీ ఏమైంది?

15 February 2024-21:26 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్  ఫాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు. ఎన్టీఆర్ నటనకి  సరిపడా సరైన పాత్రలు పడటం లేదని, సాలిడ్ హిట్ లేదని. టాలెంట్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కి తగినంత గుర్తింపు రావటం లేదని బాధ పడ్డారు. ఎన్టీఆర్ తరవాత వచ్చిన వాళ్ళు కూడా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్స్ అయిపోతున్నారు అన్ని ఉన్నా ఎన్టీఆర్ ఇంకా అలానే ఉండిపోయాడు అని నందమూరి ఫాన్స్ బాధపడుతున్న టైంలో వార్ 2  లో ఛాన్స్ వచ్చింది. ఫైనల్గా క్రేజి ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు  అనుకునే సమయానికి, షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే టైంకి, వార్ 2 మూవీకి బ్రేక్ పడిందని తెలిసి ఉస్సురు మంటున్నారు.


ఇప్పటికే కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు  వార్ 2 కూడా ఆగిపోయింది.  హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే అటు నార్త్, ఇటు సౌత్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ  పీక్స్ కి వెళ్ళింది. వార్ 2 షూటింగ్ మొదలయింది. రీసెంట్ గా స్పెయిన్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసేశారు మేకర్స్. దేవర ముగించుకుని  తారక్ సెట్ లో అడుగు పెడతాడనగా ఇలా జరిగింది. కారణం హృతిక్ రోషన్ ఈ మూవీ షూటింగ్ లో  గాయపడటమే. ఈ విషయాన్నీ హృతిక్ స్వయంగా పోస్ట్ చేసాడు.


నడుముకి బెల్టు పెట్టుకొని, చేతుల కింద క్లచెస్ సపోర్ట్ తో నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేసి వార్ 2 షూటింగ్లో గాయపడినట్టు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్పినట్టు పేర్కొన్నాడు. దీనితో ఎన్టీఆర్  ఫాన్స్  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవర అనుకున్న టైం కి రావటం లేదని, కనీసం “వార్ 2” అయినా  వస్తుందని అనుకుంటే అది కూడా లేట్ అయ్యేలా ఉందని డిసప్పాయింట్ అవుతున్నారు. RRR  తరువాత ఇప్పటివరకు తారక్ నుంచి ఇంకో సినిమా రాలేదు. హృతిక్ కి ఎప్పుడు నయమవుతుందో, తారక్ ఎప్పుడు సెట్ లో అడుగుపెడతాడో చూడాలి మరి.