ENGLISH

ఎన్టీఆర్‌ టార్గెట్‌ వంద కోట్లు

11 March 2017-18:40 PM

'జనతా గ్యారేజ్‌' సినిమా ఎన్టీఆర్‌కి మంచి ఊపునిచ్చింది. క్లాస్‌ టచ్‌ ఉన్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ ఈ సినిమా ఎన్టీఆర్‌కి మంచి సక్సెస్‌ని తెచ్చిపెట్టింది. అలాగే వసూళ్ల విషయంలో కూడా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం పండించింది ఈ సినిమా. అయితే వంద కోట్ల టార్గెట్‌ని జస్ట్‌ మిస్‌ అయ్యాడు ఈ సినిమాతో ఎన్టీఆర్‌. అందుకే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చాలా ప్లానింగ్‌తో నెక్స్ట్‌ సినిమాని రంగంలోకి దించాడు. బాబీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కళ్యాన్‌రామ్‌ నిర్మాత. ఈ సినిమాతో తాను అనుకున్న వంద కోట్ల టార్గెట్‌ని క్రాస్‌ చేయాలనే కసితో ఉన్నాడు ఎన్టీఆర్‌. అందుకే ముందే అన్నీ ఆలోచించే ఈ సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నాడట. ఈ కారణంగానే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లడం ఆలస్యమైంది. ప్రమోషన్‌ దగ్గర నుండీ, సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఎన్టీఆర్‌ దగ్గరుండి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అలాగే ఓవర్సీస్‌ దృష్టిని కూడా ఆకర్షించేందుకు ఈ సినిమాకి క్లాస్‌ టచ్‌ కొంచెం ఎక్కువే ఇవ్వాలనుకుంటున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. హాలీవుడ్‌ ప్రముఖ టెక్నీషియన్లను ఈ సినిమాలో తన గెటప్‌, మేకప్‌ కోసం తీసుకురానున్నాడు ఎన్టీఆర్‌. నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌ ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా వ్యవహరించనున్నాడట. 'జై లవ్‌ కుశ' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముగ్గురు భామలు నటించనున్నారు. వారిలో రాశీఖన్నా, నివేదా థామస్‌ పేర్లు ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది.

ALSO READ: 'లీక్‌'పై మండిపడ్డ సెక్స్‌బాంబ్‌