ENGLISH

ఎన్టీఆర్ - శంక‌ర్‌... కాంబినేష‌న్ ప‌క్కా!

02 June 2022-09:00 AM

శంక‌ర్ తొలిసారి స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. అది కూడా రామ్ చ‌ర‌ణ్‌తో..! దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కోసం `స‌ర్కారోడు`, `అధికారి` అనే రెండు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అయితే... రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా పూర్త‌యిన వెంట‌నే ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డానికి శంక‌ర్ రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్టు టాక్‌. ఈ చిత్రానికి కూడా దిల్ రాజునే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

 

శంక‌ర్ తో ఓ సినిమా చేయాల‌ని దిల్ రాజు ఎప్ప‌టి నుంచో భావిస్తున్నాడు. `భార‌తీయుడు 2`కి ఓ ద‌శ‌లో దిల్ రాజునే నిర్మాత‌. కానీ ఆ ప్రాజెక్టు కుద‌ర్లేదు. అప్పుడు ఇచ్చిన అడ్వాన్సుల‌తోనే.. రామ్ చ‌ర‌ణ్ తో సినిమా ని ఓకే చేయించాడు. చ‌ర‌ణ్ సినిమా సంద‌ర్భంలోనే.. దిల్ రాజుకి శంక‌ర్ మ‌రో క‌థ వినిపించాడ‌ట‌. అది దిల్ రాజుకి బాగా న‌చ్చింద‌ని, ఆ క‌థ‌ని ఎన్టీఆర్ తో చేయిస్తే బాగుంటుంద‌ని దిల్ రాజు భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది. శంక‌ర్ అంటే.... ఎన్టీఆర్ కాదంటాడా? పైగా దిల్ రాజు హ్యాండు ఉండ‌నే ఉంది. కాబ‌ట్టి... ఈ కాంబో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సెట్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మ‌రి అందుకు ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో చూడాలి.

ALSO READ: వెంకీ రూటు మార్చిన క‌మ‌ల్ స‌ల‌హా!