ENGLISH

టైటిలే కాదు.. బాలయ్యనీ వాడేస్తున్నారు

02 June 2022-15:03 PM

అన్ స్టాపబుల్ పేరుతో ఆహా ఓటీటీ ఓ షో హోస్ట్ చేశారు నందమూరి బాలకృష్ణ. షోతో పాటు టైటిల్ కూడా చాలా పాపులర్ అయ్యింది. అన్ స్టాపబుల్ అంటే బాలయ్యే గుర్తుకు వచ్చేటంత ప్రదారణ పొందింది టైటిల్. ఈ టైటిల్ బాలయ్య సినిమాకి యాప్ట్ గా వుంటుందని చాలా మంది భావించారు.

 

ఐతే ఈ టైటిల్ ని బిగ్ బాస్ సీజన్ 5విజేత ఆర్ జే సన్నీ వాడేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సన్నీ. ఈ చిత్రానికి అన్ స్టాపబుల్ అనే పేరు పెట్టారు. కేవలం పేరే కాదు.. ఈ సినిమాలో బాలయ్యకు సంబధించిన చాలా రిఫరెన్స్ లు వాడుకుంటున్నారని తెలిసింది. దర్శకుడు డైమండ్ రత్నబాబు బాలకృష్ణ అభిమాని. ఇందులో స్పెషల్ గా బాలయ్య అభిమానులని ఆకట్టుకునే సీక్వెన్స్ లు పెట్టుకున్నారని తెలిసింది. అవ‌న్నీ బాల‌య్య అభిమానుల్ని అల‌రించేలా ఉంటాయ‌ట‌.

 

మొత్తానికి బాలయ్య క్రేజ్ ని వాడుకుంటున్న అన్ స్టాపబుల్ చిత్ర యూనిట్.. సినిమాని సులువుగా జనాల్లోకి తీసుకెళ్ళే మార్గాన్ని సుగమం చేసుకుందని అనుకోవాలి.

ALSO READ: ఎన్టీఆర్ - శంక‌ర్‌... కాంబినేష‌న్ ప‌క్కా!