ENGLISH

అభిమానుల‌పై ఎన్టీఆర్ ఆగ్ర‌హం

22 March 2021-10:46 AM

త‌మ హీరోల విష‌యంలో అభిమానుల‌కెప్పుడూ అత్యుత్యాహ‌మే. త‌మ‌కిష్ట‌మైన స్టార్ క‌నిపిస్తే చాలు.. ఎక్క‌డ‌లేని సంబ‌రం. త‌మ ఇష్టాన్ని ర‌క‌ర‌కాల ప‌ద్ధతుల‌లో ప్ర‌క‌టించేయాల‌నిపిస్తుంది. అయితే ఒక్కోసారి అది... హీరోల‌కు ఇరిటేష‌న్ తెప్పిస్తుంది. ఆగ్ర‌హానికి కార‌ణం అవుతుంది. ఎన్టీఆర్ కూడా.. అభిమానుల‌పై కోపం తెచ్చుకున్నాడు. `తెల్లారితే గురువారం` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో.

కీర‌వాణి త‌న‌యుడు సింహ హీరోగా న‌టించిన చిత్ర‌మిది. ఎన్టీఆర్ అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా.. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. ఎన్టీఆర్ ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు `సీఎమ్ ఎన్టీఆర్..సీఎమ్ ఎన్టీఆర్‌` అంటూ.. నినాదాలు చేశారు. ముందు వాటిని ఎన్టీఆర్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే క్ర‌మంగా అవి ఎక్కువ అవ‌డంతో.. ఎన్టీఆర్ సీరియ‌స్ అయ్యాడు. `నో బ్ర‌ద‌ర్‌..ఆపండి.. ఆపండని చెప్పానా.` అంటూ కాస్త గొంతు గ‌ట్టిగ చేసి మాట్లాడాడు. అప్ప‌టికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామ్ అయ్యారు.

ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం గురించి అభిమానులెంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల రాజ‌కీయాల ఎంట్రీ గురించి కూడా ఎన్టీఆర్ మాట్లాడాడు. `ఇది స‌మ‌యం కాద‌`ని త‌ప్పించుకున్నాడు.

ALSO READ: అయినా.. ఫ్లాపు త‌ప్ప‌లేదు!