ENGLISH

అబ్బో.. ‘గురు’ భామ తెగ రూల్స్‌ పెడుతోందే!

07 February 2020-18:02 PM

రియల్‌ లైఫ్‌ బాక్సర్‌ అయిన రితికా సింగ్‌ ‘గురు’ సినిమాలో రీల్‌ లైఫ్‌లోనూ బాక్సర్‌గానే కనిపించి మెప్పించింది. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘గురు’ పేరుతో వెంకీ హీరోగా రీమేకై మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదీ భామ. కానీ, డబ్బింగ్‌ సినిమా ‘శివలింగ’ తదితర చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే, చాలా సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేసే రితికా సింగ్‌ ఈ మధ్య ఫిజిక్‌పై బాగా ఫోకస్‌ పెట్టింది. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ, నాజూకు బాడీని సొంతం చేసుకుంది అసలే క్యూట్‌ ఫీచర్స్‌తో ఎట్రాక్ట్‌ చేసే ఈ బబ్లీ పోరీ స్లిమ్‌ లుక్స్‌లో మరింత క్యూట్‌గా ఆకట్టుకుంటోంది.

 

ఇదిలా ఉంటే, లేటెస్ట్‌గా రితికా సింగ్‌ నటించిన ‘ఓ మై కడవులే’ అనే తమిళ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో తళుక్కున మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ తన మనసులోని కొన్ని మాటల్ని మీడియాతో షేర్‌ చేసుకుంటోంది. ఆ క్రమంలోనే తెలుగులో ఇకపై వరుసగా సినిమాు చేయానుకుంటున్న విషయాన్ని బయటపెట్టింది. అయితే, కథ బాగా నచ్చాలనీ, తన పాత్రకు ప్రాధాన్యత దక్కాలనే రూల్స్‌ కూడా పెడుతోంది. అలా అని గ్లామర్‌కి తానేం దూరం కాదంటోంది. సిట్యుయేషన్‌ డిమాండ్‌ మేరకు ఎంతటి గ్లామరస్‌ లుక్స్‌లోనైనా కనిపించేందుకు తాను సిద్ధమే అంటోంది.

 

మరి ఈ పాప ఆర్డర్‌ చేసినట్లుగా తెలుగులో స్టోరీలు ఆమెకోసం పుట్టుకొస్తాయా.? వాటిలో ఏరి కోరి రితికా సింగ్‌నే హీరోయిన్‌గా ఎంచుకునే అవకాశాలుంటా.? వేచి చూడాలిక. అన్నట్లు రితిక తనకిష్టమైన బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న మరో సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. అరుణ్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

ALSO READ: Ritika Singh Hot Photoshoot