ENGLISH

ఇంత కంటే ఫ్లాప్ ఇంకోటి లేద‌ట‌

07 March 2017-11:23 AM

2016లో మంచి హిట్స్ తో దూసుకుపోయాడు కింగ్‌.. నాగార్జున. 2017 ఆరంభంలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.  ఈ యేడాది నాగ్ నుంచి వ‌చ్చిన తొలి చిత్రం `ఓం న‌మో వేంక‌టేశాయ‌` బాక్సాఫీసు ద‌గ్గ‌ర దారుణంగా డింకీ కొట్టింది. 2017లో ఇప్ప‌టి వ‌ర‌కూ అతి పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచిందీ సినిమా. దాదాపు రూ.25 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన సినిమా ఇది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర కేవ‌లం రూ.9 కోట్లు మాత్ర‌మే సాధించింది. అంటే.. దాదాపుగా 16 కోట్ల న‌ష్ట‌మ‌న్న‌మాట‌.  ఓవ‌ర్సీస్‌లో ఓం న‌మో వేంక‌టేశాయ క‌నీస వ‌సూళ్ల‌నికూడా సాధించ‌లేక‌పోయింది. నైజాంలో రూ.6 కోట్ల పైచిలుకు రేటుకు కొంటే.. క‌నీసం రూ.4 కోట్ల వ‌ర‌కూ న‌ష్టాలొచ్చాయ‌ట‌. శాటిలైట్ రూపంలో రూ.12 కోట్లు ద‌క్కించుకొంది కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే.. నిర్మాత ఏమైపోదుడో. 

ALSO READ: WHY DID MEGASTAR MEET MURUGADOSS?