ENGLISH

'మా'రాజు.. శివాజీ రాజానే!

06 March 2017-18:59 PM

మా' అధ్య‌క్షుడిగా శివాజీ రాజా ఎన్నిక‌య్యారు. రాజేంద్ర ప్ర‌సాద్ ప‌ద‌వీ కాలం పూర్త‌వ్వ‌డంతో కొత్త క‌మిటీ ఎంచుకోవాల్సివ‌చ్చింది. ఈసారి ఎన్నిక‌లు లేకుండా అన్ని ప‌ద‌వుల‌కూ ఏక‌గ్రీవంగానే అభ్య‌ర్థుల‌ని ఎంచుకోవాల‌ని 'మా' బృందం తీర్మానించింది. అందుకు దాస‌రి నారాయ‌ణ‌రావు, కృష్ణ‌లాంటి సినీ దిగ్గ‌జాలు కూడా స‌రే అన‌డంతో ఈసారి 'మా' కొత్త బృందం... ఎన్నిక‌లు లేకుండానే ప‌ద‌వుల్ని చేప‌ట్ట‌నుంది.  రెండేళ్ల పాటు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉండి, 'మా'ని ముందుకు న‌డిపించిన శివాజీరాజా ని అధ్య‌క్షుడిగా న‌రేష్ ప్ర‌క‌టించారు. దానికి మిగిలిన స‌భ్యులు ఆమోదం తెలిపారు. దాంతో 'మా' ప‌గ్గాలు శివాజీ రాజా చేతికి వెళ్లాయి.  వైస్ ప్రెసిడెంట్‌గా వేణుమాధ‌వ్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా న‌రేష్‌ల‌ను ఎంపిక చేశారు. కొత్త క‌మిటీ రెండేళ్ల పాటు ప‌ద‌విలో ఉండ‌బోతోంది.