ENGLISH

'ఆదిపురుష్' రూమ‌ర్ల‌పై స్పందించిన ద‌ర్శ‌కుడు

14 April 2021-10:36 AM

క‌రోనా విజృంభిస్తోంది. ఆ భ‌యానికి సినిమాల విడుద‌ల‌లు వాయిదా ప‌డుతున్నాయి. అంతేనా..?? షూటింగులూ ఆగిపోతున్నాయి. `ఆదిపురుష్‌` టీమ్ కూడా క‌రోనా బారీన ప‌డింద‌ని, సెట్లోకి కీల‌క‌మైన స‌భ్యుడు.. క‌రోనాకి గుర‌వ్వ‌డం వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీనిపై ద‌ర్శ‌కుడు ఓం రౌత్ స్పందించాడు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింద‌న్న వార్త‌ల‌లో ఎలాంటి నిజం లేద‌ని స్ప‌ష్టం చేశాడు.

 

క‌రోనా ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఆదిపురుష్ సెట్లో అడుగుపెట్ట‌లేద‌ని, అంద‌రూ ఆరోగ్యంగా ఉన్నార‌ని, త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో షూటింగ్ జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. ముందే అనుకున్న‌ట్టు 2022 ఆగ‌స్టు 11న ఈ సినిమా విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంద‌ని, ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఇస్తూనే ఉంటామ‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. దాదాపు 400 కోట్ల‌తో తెర‌కెక్కుతోంది. సైఫ్ అలీఖాన్ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ALSO READ: బాల‌య్య సింహ‌గ‌ర్జ‌న‌.. 'అఖండ'