ENGLISH

ఆప‌రేష‌న్ వాలెంటైన్‌ మూవీ రివ్యూ & రేటింగ్

01 March 2024-10:28 AM

చిత్రం: ఆప‌రేష‌న్ వాలెంటైన్‌
నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, రుహానీ శర్మ
 
దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌
నిర్మాతలు: సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని
 
సంగీతం: మిక్కీ జె. మేయర్ 
ఛాయాగ్రహణం: హరి కే వేదాంతం
కూర్పు: నవీన్ నూలి
 
బ్యానర్స్: సోనీపిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్‌, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్
విడుదల తేదీ: 1 మార్చి 2024
 
ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5
 
ఆప‌రేష‌న్ వాలెంటైన్‌ రెండు విశేషాలు వున్న సినిమా. తెలుగులో మొదటి ఏరియల్ యాక్షన్ డ్రామా. వరుణ్ తేజ్ కి బాలీవుడ్ మేడిన్ మూవీ. పుల్వామా ఘటన నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకర్షించాయి. ఇటివలే బాలీవుడ్ లో ‘ఫైట‌ర్‌’ సినిమా ఇదే థీమ్ తో వచ్చింది. మరి ఆ సినిమాకి, వరుణ్ తేజ్ మూవీకి పోలికలు ఉన్నాయా? వరుణ్ తొలి బాలీవుడ్ ప్రయత్నం ఆకట్టుకుందా? 
 
కథ: అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్వ్కాడ్రన్ లీడ‌ర్‌. తను మొండి ఇంకా దూకుడు స్వభావం వున్న ఫైలెట్ ఫైటర్. 2019లో  పుల్వామా దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎయిర్ ఫోర్స్ నిర్ణయించుకుటుంది. ఈ మిషన్ పేరు ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్‌’. ఈ ఆపరేషన్ లో ఎలాంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయి? ఈ అపరేష్ లో రుద్ర ఎలాంటి పాత్ర పోషించాడు అనేది మిగతా కథ. 
 
విశ్లేషణ: ఏ కథకైనా ఎమోషన ఆయువు పట్టు. ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్‌’లో ఆ ఎమోషనే లోపించినట్లుగా అనిపించింది నిజ‌మైన సంఘ‌ట‌న‌లఆధారంగా రూపొందిన చిత్రమిది. పుల్వామా దాడులు. దానికి ప్రతిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఇలా అన్ని కీలక అంశాలని ఇందులో చూపించారు. అయితే చూడటానికి సన్నివేశాలు కనిపిస్తాయి కానీ అందులో బలం ఎమోషన్ రెండూ వుండవు.  హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ పండించాలని చూశారు కానీ అది కుదరలేదు. ఇక ఫైట్స్ విషయానికి వస్తే ఏరియల్ జరిగే వార్ సీన్స్ అన్ని సగటు ప్రేక్షకుడికి పట్టనట్లుగా వుంటాయి. సరైన డ్రామా వుండదు. తెరపై సన్నివేశాలన్నీ ఎమోషన్ లెస్ గా సాగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే వార్ సన్నివేశాలు గంధరగోళంగా వుంటాయి. కాసేపటికి ఎదో వీడియో గేమ్ చుపిస్తున్నారా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. తెలుగులో ఇదొక కొత్త జోనర్ అని చెప్పడం తప్పితే ఇందులోని కంటెంట్ ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. బాలీవుడ్ లో వచ్చిన ఫైటర్ ని కాస్త అందరికీ అర్ధమయ్యేలా చూపించారు కానీ ఇందులో మాత్రం కథనంలో కూడా చాలా గంధరగోళం వుంటుంది. 
 
నటీనటులు: ఫైట‌ర్ పైలెట్‌లా వ‌రుణ్‌తేజ్ పాత్ర సహజంగా కనిపించాడు. తన బాడీలాంగ్వేజ్ ఈ పాత్రకు సరిపోయింది. అయితే ఆ పాత్రలూ ఎమోషన్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు. మానుషి చిల్లర్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. అయితే  ప్రేమ‌క‌థ‌ని సరిగ్గా రిజిస్టర్ చేయలేకపోయారు. నవదీప్ పాత్రకు డైలాగ్ లేకుండా చేశారు. మిగిలిన పాత్రల‌న్నీ పరిధిమేర క‌నిపిస్తాయి. 
 
టెక్నికల్: సాంకేతికంగా సినిమా డీసెంట్ ఉంది. మిక్కీ జె.మేయ‌ర్ పాటలు రిజిస్టర్ కావు గానీ నేపధ్య సంగీతం మెప్పిస్తుంది. కెమరాపనితనం బావుంది.  నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి. దర్శకుడే సినిమా విషయంలో ఇంకా కసరత్తు చేయాల్సింది. చాలా బలహీనమైన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అది తెరపైకి ఇంకా బలహీనంగా వచ్చింది.     
 
ప్లస్ పాయింట్స్ 
వరుణ్ తేజ్ 
కొత్త జోనర్ 
 
మైనస్ పాయింట్స్ 
కథ, కథనం 
డ్రామా, ఎమోషన్ లేకపోవడం
రక్తికట్టని వార్ సీన్స్ 
 
ఫైనల్ వర్దిక్ట్: ఆపరేషన్.. పరేషాన్

ALSO READ: REVIEW IN ENGLISH