ENGLISH

Pathaan: రోజుకి వందకోట్లు.. ఇదీ పఠాన్‌ లెక్క

31 January 2023-10:33 AM

ఈ ఏడాది ప్రారంభంలోనే ‘పఠాన్‌’ తో బాలీవుడ్‌కు సూపర్‌హిట్‌ను అందించాడు షారుఖ్‌ . గత రెండేళ్లుగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న  బాలీవుడ్ కు కొత్త ఊపిరిని ఇచ్చింది.  జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పఠాన్’. కలెక్షన్‌లలో రికార్డులు సృష్టిస్తోంది. రోజుకు వంద కోట్లకు తగ్గకుండా వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది.


విడుదలకు ముందే వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. విడుదలైన దగ్గరి నుంచి ఆశ్చర్యపరిచే వసూళ్లతో  టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ గా నిలుస్తోంది.  ట్రేడ్ లెక్కల  ప్రకారం ఐదు రోజుల్లో ‘పఠాన్‌’ సినిమా రూ.542కోట్లు (గ్రాస్‌) వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో నాలుగేళ్ల తర్వాత వచ్చినా.. షారుఖ్‌ కలెక్షన్లలో కింగ్‌ఖాన్‌  ఈజ్ బ్యాక్ అని నిరూపించారని చెప్పాలి.

ALSO READ: షారుఖ్‌ని చూసి కుళ్లుకుంటున్న కంగ‌నా