ENGLISH

Shah Rukh, Kangana: షారుఖ్‌ని చూసి కుళ్లుకుంటున్న కంగ‌నా

30 January 2023-15:00 PM

సుదీర్ఘ విరామం త‌ర‌వాత షారుఖ్ ఖాన్ ఖాతాలో ఓ సూప‌ర్ హిట్ ప‌డింది. ఇటీవ‌ల విడుద‌లైన `ప‌ఠాన్‌` బాక్సాఫీసు ద‌గ్గ‌ర దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లో రూ.400 కోట్లు సాధించి - కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ హిట్ బాలీవుడ్ కి కొత్త ఊపిరి పోసింది. బాద్ షా ఫ్యాన్స్‌... సంబ‌రాలు చేసుకొంటున్నారు. అయితే.. కంగ‌నార‌నౌత్ మాత్రం ఈ హిట్ చూసి ఉడికిపోతోంది. త‌న అక్క‌సుని ట్విట్ట‌ర్‌లోనూ బ‌య‌ట‌పెట్టింది. భార‌తీయుల‌కు ఖాన్‌లంటేనే ఇష్టమ‌ని, వాళ్ల సినిమాలే నచ్చుతాయ‌ని, ముస్లిం హీరోయిన్ల‌ని ప‌ట్టించుకొన్నంత‌గా మిగిలిన‌వాళ్ల‌ని ప‌ట్టించుకోర‌న్న‌ట్టు మాట్లాడింది కంగ‌నా. అందుకే ఈదేశాన్ని మించిన దేశం లేదంటూ వ్యంగ బాణాలు వ‌దిలింది.

 

కంగ‌నా కామెంట్లు ఇప్పుడు బాలీవుడ్ లో సెగ‌లు పుట్టిస్తున్నాయి. ప‌ఠాన్ హిట్టు చూసి కంగ‌నా ఓర్వ‌లేక‌పోతోంద‌ని, అందుకే ఇలా మాట్లాడుతోంద‌ని షారుఖ్ ఫ్యాన్స్ కంగ‌నాపై కౌంట‌ర్ ఎటాకులు ఇస్తున్నారు. `ముస్లిం హీరోయిన్ల‌నే ఈ దేశం ప్రేమిస్తుంద‌నుకొంటే... నువ్వు కూడా పేరు మార్చుకో` అంటూ కంగ‌నాకు ఉచిత స‌ల‌హాలు అందిస్తున్నారు. ఇంకొంత‌మందైతే కంగ‌నాకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ప‌ఠాన్ సినిమాలో విష‌యం లేద‌ని, అదో వీడియో గేమ్ లా ఉంద‌ని, కేవ‌లం షారుఖ్ కోస‌మే ఆ సినిమా చూస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.