ENGLISH

Mrunal Thakur: ఇక్క‌డ నాని.. అక్క‌డ సూర్య‌

30 January 2023-14:20 PM

సీతారామంలో సీత‌గా ఆక‌ట్టుకొంది మృణాల్ ఠాకూర్‌. ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌య్యింది. మృణాల్‌కి మంచి పేరొచ్చింది. దాంతో పాటు అవ‌కాశాలు కూడా గుమ్మిగూడాయి. కానీ.. మృణాల్ ఆచి తూచి సినిమాల్ని ఎంచుకొంటోంది. ఇటీవ‌ల నాని సినిమాకి సంత‌కం చేసింది మృణాల్. త్వ‌ర‌లోనే ఈసినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇప్పుడు సూర్య సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకొంది. సూర్య క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. చారిత్ర‌క నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. దిశాప‌టానీ ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రెండో హీరోయిన్ పాత్ర మృణాల్ కి ద‌క్కింది. నిజానికి సెకండ్ లీడ్ చేయ‌డానికి మృణాల్ ఇష్ట‌ప‌డ‌డం లేదు. అయినా స‌రే.. ఈ సినిమా ఒప్పుకొంది. దానికి కార‌ణం.. త‌న పాత్ర బాగా న‌చ్చ‌డ‌మే అని టాక్‌. పైగా సూర్య అంటే.. మృణాల్ కి ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చింద‌ట‌.

 

సీతారామం మృణాల్ కి తొలి తెలుగు చిత్రం. ఆ సినిమాకి నామ మాత్ర‌మైన పారితోషికం అందుకొంది మృణాల్‌. అయితే ఆ సినిమా హిట్ట‌వ్వ‌గానే ఏకంగా త‌న పారితోషికాన్ని రూ.1.5 కోట్ల‌కు పెంచేసింద‌ట‌. నాని సినిమాకి కోటిన్న‌ర సమ‌ర్పించుకోవాల్సివ‌చ్చింది. సూర్య సినిమాకీ అంతే అందుకొంద‌ట‌. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క‌టి హిట్ అయినా.. క‌చ్చితంగా రూ.2 కోట్ల లీగ్‌లోకి వెళ్లిపోతుంది.