బాలీవుడ్‌కి పఠాన్ విజయం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వరుస డిజాస్టర్లతో వైభవాన్ని కోల్పోయిన బాలీవుడ్ కి పఠాన్ విజయం కొత్త ఊపిరి పోసింది. గత నెల 25న విడుదలైన పఠాన్.. తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. నెల రోజులు తిరక్కముందే ఈ ఫీట్ సాధించి ట్రేడ్ వర్గాలను అబ్బుర పరిచింది. దాంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 5వ స్థానం సంపాదించింది.
ఈ జాబితాలో దాదాపు రూ.2 వేల కోట్లతో దంగల్ మొదటి స్థానంలో ఉంది. రూ.1750 కోట్లతో బాహుబలి రెండో స్థానంలో నిలిచింది. కేజీఎఫ్ కి 3, ఆర్.ఆర్.ఆర్‌కి 4వ స్థానం దక్కాయి. ఇక్కడ పఠాన్ విషయంలో ఓ ప్రత్యేకత ఉంది. టాప్ 5లో నిలిచిన మిగిలిన 4 చిత్రాలూ చైనాలోనూ విడులదయ్యాయి. అక్కడ వసూళ్లు ఆయా చిత్రాలకు బాగా కలిసొచ్చాయి. పఠాన్ మాత్రం చైనాలో ఇంత వరకూ విడుదల కాలేదు. అక్కడ పఠాన్ విడుదలైతే.. ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
టోటల్ రన్‌లో కనీసం 3వ స్థానం దక్కించుకొనే అవకాశం కనిపిస్తోంది. రూ.250 కోట్ల వ్యయంతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం షారుఖ్ కేవలం రూ.40 కోట్ల పారితోషికం తీసుకొన్నాడు. ఇప్పుడు లాభాల్లో వాటా అందుకొంటున్నాడు.