ENGLISH

Pooja Hegde: రేటు త‌గ్గించినా... ఫ‌లితం లేదు పూజా..!

22 February 2023-12:00 PM

టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకొంటున్న క‌థానాయిక‌ల్లో పూజా హెగ్డే పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఒక్కో సినిమాకి రూ.3.5 నుంచి రూ.4 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ పూజా పారితోషికాన్ని అందుకొంటోంది. పూజా ఉంటే సినిమాకి గ్లామ‌ర్ ప‌రంగా క‌లిసొస్తుంద‌ని న‌మ్ముతున్న నిర్మాత‌లు ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారు. అయితే.. ఈమ‌ధ్య పూజా హెగ్డేకి స‌రైన విజ‌యాలు లేవు. ఫామ్ లో లేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. పూజా ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే.. నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమెకు అవ‌కాశాలు కూడా త‌గ్గుతున్నాయి. ఇవ‌న్నీ గ‌మ‌నించిన పూజా.. తాజాగా త‌న పారితోషికాన్ని బాగా త‌గ్గించిన‌ట్టు టాక్‌.

 

రూ.4 కోట్లు తీసుకొనే పూజా... ప్ర‌స్తుతం రూ.3 కోట్ల‌కు ప‌డిపోయింద‌ని తెలుస్తోంది. పారితోషికం త‌గ్గించ‌డం వ‌ల్ల మ‌రింత మంది నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉండొచ్చ‌న్న‌ది పూజా ప్లాన్‌. కానీ ఇది కూడా వ‌ర్క‌వుట్ అయ్యేలా లేదు. రూ.3 కోట్ల‌న్నా.. పూజా వైపు నిర్మాత‌లు చూడ‌డం లేదు. ఇప్ప‌టికే దాదాపు అంద‌రు అగ్ర హీరోల స‌ర‌స‌న జ‌ట్టు క‌ట్టేసింది పూజా. ద‌ర్శ‌కులు కొత్త కాంబినేష‌న్ల వైపుగా ఆలోచిస్తున్నారు. ఈ ద‌శ‌లో పూజా పేరు అస్స‌లు ప‌రిశీలించ‌డం లేదు. దాంతో... ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌మంలో ప‌డిపోయింది పూజా.