ENGLISH

భక్తుడికి పవన్‌ కళ్యాణ్‌ వరమిచ్చాడా?

11 March 2017-18:42 PM

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పవన్‌ కళ్యాణ్‌ వీరభిమానుల్లో బండ్ల గణేష్‌ ఒకరు. ఈయన పవన్‌కి వీరాభిమాని అనే దాని కన్నా అరి వీర భక్తుడు అనడమే సబబు. అంత అభిమానం పవన్‌ అంటే బండ్ల గణేష్‌కి. నిర్మాతగా పెయిల్యూర్స్‌ చవి చూసి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బండ్ల గణేష్‌ 'గబ్బర్‌ సింగ్‌' సినిమాతో రైజ్‌ అప్‌ అయ్యాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో బండ్ల గణేష్‌ మళ్లీ నిర్మాతగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు పవన్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట బండ్ల గణేష్‌. అందుకు పవన్‌ కూడా ఓకే చెప్పారట. అయితే ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ డైరీ అస్సలు ఖాళీ లేదు. చేతి నిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న 'కాటమరాయుడు' సినిమా పూర్తి కాగానే వెంటనే త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కేస్తుంది. ఆ వెంటనే తమిళ దర్శకుడు నేశన్‌ డైరెక్షన్‌లో సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ కాక దాసరి ప్రొడక్షన్‌లో ఓ సినిమాకి పవన్‌ కళ్యాన్‌ కమిట్‌ అయ్యాడు. ఇన్ని ప్రాజెక్ట్‌లపై పవన్‌ కళ్యాణ్‌ బండ్ల గణేష్‌తో చేయబోయే సినిమా కార్యరూపం దాల్చేదెప్పుడు. వీటన్నింటి మధ్యా పవన్‌ ఎప్పుడు బండ్ల గణేష్‌కి ఛాన్సిస్తాడో చూడాలిక. ఇక మరో పక్క 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది చిత్ర యూనిట్‌. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: హీరో శివబాలాజీ కి చేదు అనుభవం!