ENGLISH

మెగా బ్రదర్స్‌ కలిశారంట

23 August 2017-15:50 PM

మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా నిన్న టైటిల్‌ లోగో లాంఛింగ్‌ ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ రాలేదన్న చిన్న డిజప్పాయింట్‌మెంట్‌ ఫ్యాన్స్‌లో ఉన్నప్పటికీ, టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ చూశాక అభిమానులు ఫుల్‌ ఖుషీ అయిపోయారు. అయితే ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో కూడా పవన్‌ కళ్యాణ్‌ ఉండి ఉంటే బాగుండని ఆశించారు. కానీ అది జరగదు కదా. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఫంక్షన్‌కి రాలేకపోయినా, చిరంజీవి ఇంటికి వెళ్లి అన్నయ్యకి ఆత్మీయంగా బర్త్‌డే విషెస్‌ చెప్పాడనీ సమచారమ్‌. అయితే అలా జరిగి ఉంటే ఏదో రకంగా ఒక్క ఫోటో అయినా బయటికి వచ్చి ఉండేది. కానీ అలాంటి ఏ ఇన్‌ఫర్మేషన్‌ బయటికి రాలేదు. మొత్తానికి చిరు - పవన్‌ కలిశారనే గాసిప్‌ అయినా ఫ్యాన్స్‌కి ఆనందమే. ఈ ఇద్దరు బ్రదర్స్‌ మధ్యా పొత్తులు సరిగా లేవంటూ ఎప్పటి నుండో నడుస్తున్న తంతే. వాటిని మెగా ఫ్యామిలీ ఖండిస్తూనే వస్తోంది. గతంలో చిరంజీవి 150వ సినిమా ఫంక్షన్‌కీ పవన్‌ హాజరు కాలేదు. అదే పరిస్థితి ఇప్పుడు మళ్లీ. ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రమైన 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి నటిస్తున్నారు. అంత గొప్ప అటెంప్ట్‌ చేస్తున్న అన్నయ్యకు పవర్‌ స్టార్‌ బహిరంగంగా తెలిసేలా ఓ మెసేజ్‌ పోస్ట్‌ చేసి ఉంటే బాగుండేది. ఇలాంటి రూమర్స్‌కి కొంచెం అయినా అడ్డుకట్ట వేసినట్లయ్యేది. పవన్‌ కళ్యాణ్‌ అలా కూడా చేయడం లేదు. ఏది ఏమైనా అన్నయ్యను తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కలిశాడు.. పుట్టినరోజు విషెస్‌ చెప్పాడు.. అలాగే ఆయన 'సైరా నరసింహారెడ్డి' సినిమా గురించి కూడా ముచ్చటించాడు.. అనే న్యూస్‌ నిజమైనా కాకపోయినా కానీ ఫ్యాన్స్‌ మాత్రం పండగ చేసేసుకుంటున్నారంతే!

ALSO READ: మళ్ళీ పెళ్ళి చేసుకోనున్న నటి