ENGLISH

స‌త్యాగ్ర‌హి అందుకే ఆపేశా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

02 September 2020-11:31 AM

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌దులుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలైతే... క్లాప్ కొట్టాక కూడా, ఆపేశారు. అలాంటి సినిమాల్లో... `స‌త్యాగ్ర‌హి` ఒక‌టి. ప‌వ‌న్ చేప‌ట్టిన భారీ ప్రాజెక్టు ఇది. భారీ సెట‌ప్ తో మొద‌లైంది. కానీ... సినిమా ఆపేశారు. ఈసినిమా మ‌ళ్లీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ లేదు.

 

ఈ సినిమా గురించి ప‌వ‌న్ మ‌రోసారి ప్ర‌స్తావించాడు. ''ఆక‌థ‌లో ఏం చెప్పాల‌నుకున్నానో.. నిజ జీవితంలోనే నేను అదే చెబుతున్నాను. అలానే ఉంటున్నాను. ఇక ప్ర‌త్యేకించి సినిమాగా చూపించే ఉద్దేశం లేదు. సినిమాల్లో నీతులు చెప్పే కంటే, బ‌య‌ట ఆచ‌రించి చూపించ‌డం మేలు. సినిమాల్లో పోరాటం చేసినంత మాత్రాన ప‌నులు జ‌ర‌గ‌వు. అందుకే ఆ సినిమాని ఆపేశాను. ఆసినిమా ఆపేసిన‌ప్పుడు చాలామంది తిట్టారు కూడా. ఆ ప్రాజెక్టు మ‌ళ్లీ చేప‌ట్టేది లేదు..'' అని తేల్చి చెప్పేశాడు ప‌వ‌న్‌.

ALSO READ: అప్పులు తీర్చ‌డానికే అమ్మేశాడా?