ENGLISH

ప‌వ‌న్ చేతిలో మ‌రో సినిమా... అంత ఖాళీ దొరుకుతుందా?

19 November 2021-12:00 PM

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం అత్యంత బిజీయెస్ట్ హీరో ఎవ‌రంటే, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరే చెప్పాలి. భీమ్లా నాయ‌క్‌, హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు... రెండూ ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లాడు ప‌వ‌న్‌. ఈ రెండు సినిమాల‌తో బిజీ. మ‌రోవైపు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఓకే చెప్పాడు. హ‌రీష్ శంక‌ర్ తో సినిమాఉంది. ఇవ‌న్నీఎప్పుడు పూర్త‌వుతాయో కూడా తెలీదు. వీటి మ‌ధ్య‌న మ‌రో సినిమా చేరింద‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

 

టాలీవుడ్ నిర్మాత‌లు... భ‌గ‌వాన్‌, పుల్లారావు ద‌గ్గ‌ర ప‌వ‌న్ ఇది వ‌ర‌కే అడ్వాన్స్ తీసుకున్నాడ‌ట‌. ఇప్పుడు వాళ్లు `సినిమా చేస్తారా, లేదా` అంటూ ప‌వ‌న్ పై ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్టు స‌మాచారం. వాళ్ల కోసం ప‌వ‌న్ ఓ సినిమా అర్జెంటుగా చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ని స‌మాచారం అందుతోంది. ఓ కొత్త‌ద‌ర్శ‌కుడు ఇప్ప‌టికే ప‌వ‌న్ కోసం క‌థ సిద్ధం చేశాడ‌ని, ఆ క‌థ‌తోనే.. సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది.

 

వ‌రుస‌గా పెద్ద ద‌ర్శ‌కుల‌తో చేస్తున్న ప‌వ‌న్‌.. ఇప్పుడున్న ఈ ప‌రిస్థితుల్లో కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌మే. అదీ కాక‌... హ‌రీష్ శంక‌ర్‌, సురేంద‌ర్ రెడ్డి సినిమాలు రెండూ చేస్తాడా, లేదా? అందులోంచి ఓ సినిమా ప‌క్క‌న పెడ‌తాడా? అనే మిమాంశ‌లో ఉన్న‌ప్పుడు, కొత్త‌గా ఓ సినిమా ఒప్పుకోవ‌డం షాకిచ్చే విష‌య‌మే. కాక‌పోతే.. ఇది వ‌ర‌కెప్పుడో ప‌వ‌న్ తీసుకున్న అడ్వాన్సుల వ‌ల్లే ఈ సినిమాలు త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో చేయాల్సివ‌స్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపురాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న‌ప‌వ‌న్‌.. ఈ సినిమా చేస్తే.. ఆశ్చ‌ర్య‌మే.

ALSO READ: వంద థియేట‌ర్ల‌లో స్పెష‌ల్ షో.. ఎక్క‌డంటే..?