ENGLISH

మ‌ళ్లీ పాట పాడుతున్న ప‌వ‌న్‌

23 March 2021-10:49 AM

ప‌వ‌న్ కి పాట‌లు పాడ‌డ‌మంటే భ‌లే స‌ర‌దా. త‌న గొంతు కూడా గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. స్వ‌త‌హాగా జాన ప‌దాలంటే ఇష్టం. తాను కూడా అలాంటి పాట‌లే పాడుతుంటాడు. అత్తారింటికి దారేదిలో పాడిన కాట‌మ రాయుడా.. క‌ద‌రీ న‌ర‌సింహుడా.. ఓ ఊపు ఊపేసింది. అంత‌కు ముందు జానీ, ఖుషీ లాంటి సినిమాల్లోనూ పాట‌లు పాడాడు. ఇప్పుడు మ‌రోసారి గొంతు స‌వ‌రించుకోబోతున్నాడు.

 

అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ రీమేక్ లో ప‌వ‌న్ - రానా ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ప‌వ‌న్ ఓ పాట పాడ‌బోతున్న‌ట్టు స‌మాచారం. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందింస్తున్నాడు. ప‌వ‌న్ కోసం ఓ క్యాచీ ట్యూన్ ని త‌మ‌న్ సిద్ధం చేశాడ‌ట‌. ఈసారి కూడా జాన ప‌ద త‌ర‌హా గీత‌మే అని తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు.

ALSO READ: రామ్... వైష్ణ‌వ్‌.. ఇద్ద‌రూ కాద‌ట‌!