ENGLISH

నితిన్‌కి 'ప‌వ‌న్‌' సెగ‌

07 January 2021-13:30 PM

నితిన్ అంటే ప‌వ‌న్ కి వీర భ‌క్తుడు. త‌న సినిమాల్లో ఏదోలా ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తీసుకొస్తుంటాడు. ప‌వ‌న్ మేన‌రిజాన్ని ఇమిటేట్ చేస్తూరో, పవ‌న్ డైలాగుల్ని గుర్తు చేస్తూనో ప‌వ‌ర్ స్టార్ అభిమానుల్ని ఖుషీ చేస్తుంటారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా.. నితిన్ ని `త‌మ వాడు`గానే భావిస్తారు. అలాంటి నితిన్ కి ఇప్పుడు ప‌వ‌న్ సెగ త‌గ‌ల‌బోతోంది.

 

నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `రంగ్ దే` మార్చి 26న విడుద‌ల కాబోతోంది. నిజానికి ఈ సంక్రాంతిని విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. పోటీ ఎందుకులే.. అని మార్చికి వెళ్లిపోయాడు. అయితే.. అక్క‌డా నితిన్ కి పోటీ త‌ప్ప‌డం లేదు. రానా న‌టించిన `అర‌ణ్య‌` అదే రోజున విడుద‌ల అవుతోంది. అంతే కాదు.. ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్‌` ని కూడా మార్చి 26నే తీసుకురావాల‌ని భావిస్తున్నార్ట‌. అదే జ‌రిగితే.. నితిన్ కి స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. ప‌వ‌న్ కి పోటీగా త‌న సినిమాని విడుద‌ల చేసేంత తెలివి త‌క్కువ నిర్ణ‌యం నితిన్ తీసుకోడు. ఒక వేళ ప‌వ‌న్ సినిమా వ‌స్తే.. నితిన్ సినిమా వాయిదా ప‌డ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ పండితులు లెక్క వేస్తున్నారు. మ‌రి నితిన్ ఏమంటాడో చూడాలి.

ALSO READ: భ‌ర‌ణి ద‌ర్శ‌కత్వంలో బిగ్ బీ!