ENGLISH

గ్లామ్‌షాట్‌: బాత్‌ టబ్‌లో స్పైసీ పాయల్‌.!

28 December 2018-18:10 PM

బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ షార్ట్‌ కాస్ట్యూమ్‌లో టాప్‌ని బ్లూ జీన్స్‌ జాకెట్‌తో కవర్‌ చేసి బాత్‌ టబ్‌లో హాట్‌ అప్పీల్‌ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మకి పరిచయం అస్సలు అక్కర్లేదు. ఈ ఏడాది తెరంగేట్రం చేసిన అందాల భామల్లో రిజిస్టర్డ్‌ ఫేస్‌గా గుర్తింపు కార్డు దక్కించుకుంది పంజాబీ ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌. అందుకు కారణం తొలి సినిమాలోనే ఎలాంటి బెరకూ, మొహమాటం లేకుండా అందాలారేసేయడమే. 

 

అందాల ఆరబోతతో పాటు, అద్భుతమైన పర్‌ఫామెన్స్‌ కూడా ఇచ్చేయడంతో ఈ బ్యూటీకి బాగా క్రేజ్‌ వచ్చేసింది. 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో విచ్చలవిడి గ్లామర్‌ ప్రదర్శన చేసి, తర్వాత రెండు సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేసింది. ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్‌'లో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది పాయల్‌. మాస్‌ రాజా రవితేజ సరసన మరో సినిమాలో తన హాటెస్ట్‌ గ్లామర్‌తో చిందేసేందుకు సిద్ధంగా ఉంది. 

ALSO READ: హీరోయిన్ కి వివాదం తెచ్చిపెట్టిన కామెంట్స్...