ENGLISH

పూర్ణ‌.... గీత దాటేస్తోందా?

27 March 2021-12:00 PM

ర‌విబాబు ప్రోత్సాహంతో తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేసింది పూర్ణ‌. త‌న‌కంత గుర్తింపు రాలేదు గానీ, ప్ర‌తిభావంతురాలే. అవును.. లాంటి హార‌ర్ సినిమాలోనూ త‌న గ్లామ‌ర్‌తో ప‌డేసింది. ఇప్పుడు టీవీ షోలలో జ‌డ్జ్‌గా కనిపిస్తోంది. బాల‌కృష్ణ - బోయ‌పాటి సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకుని, త‌న సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్రారంభించింది. అన్న‌ట్టు ఈ గ్యాప్‌లో `సుంద‌రి` అనే సినిమా చేసింది. చూస్తుంటే లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెట్ లా ఉంది.

 

ప్ర‌చార చిత్రాల్లో పూర్ణ మ‌రీ.. బొద్దుగా ఉంది. కాక‌పోతే.. త‌న గ్లామ‌ర్ మాత్రం త‌గ్గ‌లేదు. కొన్ని బోల్డ్ స‌న్నివేశాల్లో... పూర్ణ విజృంభించి న‌టించింద‌న్న విష‌యం ప్ర‌చార చిత్రాలు చూస్తుంటే తెలిసిపోతోంది. బాలయ్య సినిమాలో త‌న టాలెంట్ పూర్తి స్థాయిలో చూపించే అవ‌కాశం ఉన్నా, లేకున్నా `సుంద‌రి`తో మాత్రం మ‌రోమారి మార్కులు కొట్టేసే ప‌నిలో ప‌డింది. ఈ సినిమా మాస్‌కి న‌చ్చితే ఇంకొన్నాళ్లు పూర్ణ‌ని వెండి తెర‌పై చూడొచ్చు.

ALSO READ: Poorna Latest Photoshoot