ENGLISH

డైలామాలో ప్ర‌భాస్ సినిమా

07 March 2022-12:00 PM

ప్ర‌భాస్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఓ సినిమా త‌ర‌వాత మ‌రో సినిమా, దాని త‌ర‌వాత ఇంకోటి... ఇలా స్పీడు స్పీడుగా సినిమాలు చేసేస్తున్నాడు. అన్నీ పాన్ ఇండియా సినిమాలే. 2022లో మూడు సినిమాల్ని విడుద‌ల చేయ‌డం త‌న టార్గెట్ అంటున్నాడు ప్ర‌భాస్‌. ఈనెల 11న రాధేశ్యామ్ వ‌స్తోంది. స‌లార్ కూడా ఈ యేడాదే విడుద‌ల అవుతుంది. మ‌రోవైపు స్పిరిట్‌, ప్రాజెక్ట్ కె, ఆది పురుష్ సినిమాలున్నాయి.

 

వీటిమ‌ధ్య మారుతితో ఓ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మారుతి కూడా క‌థ రెడీ చేసేశాడ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రావాలి. అయితే ఇప్పుడు ఈ సినిమా విష‌యంలో ప్ర‌భాస్ డైలామాలో ప‌డ్డాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. కేవ‌లం మూడంటే మూడు నెల‌ల్లో పూర్తి చేయాల‌న్న ఉద్దేశంతో మారుతి సినిమా ఓకే అన్నాడు. దానికి త‌గ్గ‌ట్టే క‌థ సెట్ట‌య్యింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా చేయాలా? వ‌ద్దా? అనే సందిగ్థంలో ప్ర‌భాస్ ఉన్నాడ‌ని, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు అయ్యాకే.. మ‌రో సినిమా గురించి ఆలోచించాల‌ని అనుకుంటున్నాడ‌ని, ఈ రెండు సినిమాల మ‌ధ్య మూడు నెల‌ల గ్యాప్ దొరికితేనే మారుతి సినిమాని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తార‌ని స‌మాచారం. మ‌రి అంత స‌మ‌యం ప్ర‌భాస్ చేతుల్లో ఉందా, లేదా? అనేది తేలాల్సివుంది

ALSO READ: రౌడీ కోసం మూడు కోట్లు అడిగిన స‌మంత‌