ENGLISH

ప్ర‌భాస్ నుంచి మ‌రో పాన్ ఇండియా సినిమా

23 March 2021-12:00 PM

పాన్ ఇండియా ప్రాజెక్టుల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా మారాడు.. ప్ర‌భాస్‌. త‌న చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. స‌లార్‌, ఆదిపురుష్ సెట్స్‌పై ఉన్నాయి. నాగ అశ్విన్ క‌థ‌కూ ఓకే చెప్పేశాడు. ఇప్పుడు మ‌రో సినిమాపై సంత‌కం చేసిన‌ట్టు టాక్‌. దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి ప్ర‌భాస్ అంగీక‌రించాడ‌ని, అందుకు గానూ... ప్ర‌భాస్ భారీ అడ్వాన్సుని అందుకున్నాడ‌ని తెలుస్తోంది. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఖ‌రారు కాలేదు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే.

 

`మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌` త‌ర‌వాత‌.. దిల్ రాజు బ్యాన‌ర్‌లో మ‌ళ్లీ ప్ర‌భాస్ సినిమా చేయ‌డం ఇదే తొలిసారి. దిల్ రాజు కాంపౌండ్ లో ఎప్పుడూ కొత్ ద‌ర్శ‌కులు మెరుస్తూనే ఉంటారు. కొత్త క‌థ‌లు సిద్ధం అవుతూనే ఉంటాయి. ఈసారీ.. ప్ర‌భాస్ కోసం కొత్త ద‌ర్శ‌కుడినే ఎంచుకునే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. దిల్ రాజు ద‌గ్గ‌ర ఆల్రెడీ ప్ర‌భాస్ కి స‌రిప‌డ క‌థ ఉంద‌ని, అందుకే. అడ్వాన్స్ ఇచ్చి ప్ర‌భాస్ ని లాక్ చేశాడ‌ని చెప్పుకుంటున్నారు. మ‌రి దిల్ రాజు మ‌న‌సులో ఏముందో..?

ALSO READ: రామ్... వైష్ణ‌వ్‌.. ఇద్ద‌రూ కాద‌ట‌!