ENGLISH

ఇల్లు విడ‌చి బ‌య‌ట‌కు రాను

23 March 2021-11:11 AM

మ‌న హీరోయిన్లు సెట్లోనే కాదు, ఇంట్లోనూ మ‌హా రాణులే. చాలామంది వంటింట్లోకి కూడా అడుగుపెట్టి ఉండ‌రు. ఎందుకంటే.. ఆ అవ‌స‌రం, అవ‌కాశం వాళ్ల‌కు వ‌చ్చి ఉండ‌దు. కొంత‌మంది అయితే.. ఇంట్లో ఉంటే.. నానా హ‌డావుడీ చేసేస్తారు. పెత్త‌నం అంతా త‌మ‌దే అన్న‌ట్టుంటారు. ర‌ష్మిక కూడా అంతేన‌ట‌. ఇంట్లో ఉంటే.. క్ష‌ణం కూడా తీరిక లేకుండా ఉంటుంద‌ట‌. ఇంటి వ్య‌వ‌హారాల్నీ త‌నే నెత్తిమీద వేసుకుంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని త‌నే చెప్పింది.

 

``ఇంట్లో ఉండే అవ‌కాశం చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో వ‌స్తుంటుంది. అలాంట‌ప్పుడు.. ఇల్లు విడిచి బ‌య‌ట‌కు రాను. ఇంటి ప‌నుల్ని స్య‌యంగా చేసుకోవ‌డంలో ఉండే తృప్తి వేరు. ఇప్ప‌టికీ నా ప‌నుల‌న్నీ నేనే చేసుకుంటా. అతిథులెవ‌రైనా వ‌స్తే... వాళ్ల‌కు కావ‌ల్సిన‌ని స్వ‌యంగా స‌మ‌కూర్చ‌డం ఇంకా ఇష్టం`` అంటోంది. తెలుగు, త‌మిళం అంటూ.. ద‌క్షిణాది మొత్తం అటూ ఇటూ తిరిగేస్తున్న ర‌ష్మిక‌.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ప్ర‌తాపం చూపించాల‌నుకుంటోంది. వ‌రుస‌గా సినిమాల‌తో బిజీగా ఉంటున్న ర‌ష్మిక కు అస‌లు ఇంట్లో ఉండే తీరిక దొరుకుతుందా, లేదా? అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. అన్న‌ట్టు ర‌ష్మిక ఈ మ‌ధ్య ముంబైలోనూ ఓ ఇల్లు కొనేసింద‌ట‌. అక్క‌డ సినిమాలు చేస్తోంది క‌దా. మ‌రి వాళ్ల‌కు ట‌చ్ లో ఉండ‌డానికి ఓ ఇల్లో, ఆఫీసో కావాలి క‌దా..?

ALSO READ: రామ్... వైష్ణ‌వ్‌.. ఇద్ద‌రూ కాద‌ట‌!