ENGLISH

మళ్ళీ రామాయణంలో ప్రభాస్

02 March 2024-13:19 PM

రామాయణం ఎవరు తీసినా ఎప్పుడు తీసినా భారీ అంచనాలు నెలకొనటం సాధారణం. ఎన్ని సార్లు చూసినా విసుగురాని అద్భుత ఇతిహాస కావ్యం. రామాయణం ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా చెప్పట్టింది బాలీవుడ్. ఆదిపురుష్ డిజాస్టర్ కావటంతో అత్యంత శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించే పనిలో పడ్డారు నితీష్ తివారీ.  5000 కోట్లతో ఈ రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంత బడ్జెట్ కి ప్రధాన కారణం ఇందులో నటిస్తున్న స్టార్​కాస్ట్  అని చెప్పొచ్చు. కాస్టింగ్ తోనే అంచనాలు పీక్స్ కి వెళ్తున్నాయి. అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.


రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రావణ్‌ గా  యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్‌, కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణ పాత్రలో విజయ్ సేతుపతి, శూర్పణఖ పాత్రలో  రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నారు. ఇప్పటికే అదిరిపోయే స్టార్ కాస్టింగ్ ఉండగా ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీలో నటించనున్నాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఆది పురుష్ లో రాముడిగా కనిపించిన ప్రభాస్ ఈ రామాయణంలో  పరశురాముడిగా స్పెషల్ అప్పీరెన్స్​ ఇవ్వనున్నట్లు సమాచారం.


ఈ కాస్టింగ్​పై అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇంకా రాలేదు. శ్రీరామ నవమి రోజున దర్శకుడు ఈ మూవీకి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 2025 దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని, అంతేకాదు ఈ ఇతిహాసాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.