ENGLISH

గ్లామ్‌షాట్‌: పిచ్చెక్కిస్తోన్న 'కంచె' గ్లామర్‌!

05 July 2019-13:00 PM

కెరీర్‌లో తొలి సినిమా సూపర్‌ హిట్‌ ఉన్నా, ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌కి రావల్సినన్ని అవకాశాలు రావడం లేదు. అందం, అభినయం, ఎలాంటి పాత్రనైనా టేకప్‌ చేయగల సత్తా, అన్నింటికీ మించి గ్లామర్‌లో నో మొహమాటమ్స్‌.. ఇలా హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని బెస్ట్‌ క్వాలిటీస్‌ ఉన్నప్పటికీ ఎందుకో అమ్మడికి అవకాశాలే రీచ్‌ అవడం లేదు. ఒక్క ఛాన్స్‌ అంటూ తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది పాపం.

 

ఈ మధ్య గ్లామర్‌ కంచె పూర్తిగా తెంచేసి స్పెషల్‌ ఫోటో షూట్స్‌ చేయించుకుంటోంది. ఆ గ్లామర్‌ పిక్స్‌ని ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియాలో వదులుతోంది. అవి చూసి అయినా మన దర్శక, నిర్మాతల మనసు మారడం లేదో ఏమో. అసలీ భామ వైపు ఓ సారైనా కన్నేయడం లేదు. కొత్త కొత్త భామల్ని దిగుమతి చేసుకుంటున్న టాలీవుడ్‌కి మన 'సీత' పై సీత కన్నెందుకో కదా. ఇక తాజా పిక్‌ విషయానికొస్తే, డార్క్‌ మెరూన్‌ కలర్‌ వస్త్రాలంకరణలో సీత అందాలు కెవ్వు కేక పుట్టిస్తున్నాయి. డార్క్‌ మెరూన్‌ డ్రస్‌ కలర్‌కి, బంగారు వర్ణంలో ఆమె స్కిన్‌ టోన్‌ ధగ ధగలు కురిపిస్తోంది. హాట్‌ క్లీవేజ్‌, ఆ కింద స్టైలిష్‌ కట్‌ ఆమె అందాన్ని మరింత మురిపిస్తోంది. లూజ్‌ హెయిర్‌తో సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి, కిక్కెక్కిస్తోంది అందాల ప్రగ్యా.

ALSO READ: Pragna Jaiswal New Photoshoot