ENGLISH

ప్ర‌వీణ్ స‌త్తారుకి ఓకే చెప్పిన మెగా హీరో?!

28 August 2020-16:58 PM

చంద‌మామా క‌థ‌లు, గ‌రుడ వేగ లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఇప్పుడు నాగార్జున కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే నాగ్‌, ప్ర‌వీణ్ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈలోగా మ‌రో హీరోతోనూ ఓకే అనిపించుకున్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. త‌నే.. వ‌రుణ్ తేజ్‌.

 

14 రీల్స్ లో వ‌రుణ్ ఓ సినిమా చేయాల్సివుంది. ఇప్ప‌టికే సాగ‌ర్ చంద్ర - 14 రీల్స్‌కి ఓ క‌థ చెప్పాడు. ఈ ఇద్ద‌రి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈలోగా ప్ర‌వీణ్ స‌త్తారు కూడా 14 రీల్స్ లోనే క‌థ చెప్పాడ‌ట‌. వాళ్లూ ఈ క‌థ‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ క‌థ కూడా వ‌రుణ్ కి యాప్ట్ గా ఉంటుంద‌ని 14 రీల్స్ నిర్మాత‌లు భావిస్తున్నార‌ని స‌మాచారం. అయితే... 14 రీల్స్ లో వ‌రుణ్ ఒక్క సినిమానే చేయ‌గ‌ల‌డు. అది సాగ‌ర్ చంద్రా సినిమానా, లేదంటే ప్ర‌వీణ్ స‌త్తారుతోనా అన్న‌ది తేలాల్సివుంది. కాక‌పోతే ఈ రెండు సినిమాలూ ప‌ట్టాలెక్క‌డానికి కొంత టైమ్ ప‌డుతుంది. ఎందుకంటే వ‌రుణ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అవి పూర్త‌యితే గానీ 14 రీల్స్ కి సినిమా చేయ‌లేడు.

ALSO READ: ఆ రీమేక్ లో తల్లి పాత్రలో త్రిష.