ENGLISH

'సైరా' - అమేజింగ్‌ స్ట్రాటజీస్‌

28 August 2017-17:24 PM

150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాకి మార్కెటింగ్‌ పరంగా పక్కా ప్లానింగ్స్‌ ఉండాలి. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది ఈ సినిమా. అందుకు తగ్గట్లుగానే పబ్లిసిటీ ప్లానింగ్స్‌ కూడా పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ముందుగానే ఊహించింది. అన్ని స్ట్రాటజీస్‌ని పక్కాగా రెడీ చేసి పెట్టుకుంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఆ స్ట్రాటజీలను అప్లై చేయనున్నారట. ఈ రోజుల్లో ఓ సినిమాకి హైప్‌ క్రియేట్‌ కావాలంటే సోషల్‌ మీడియానే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. అందుకే సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచార వ్యూహాలు ప్లాన్‌ చేశారట. అయితే అన్నింటికీ మించి 'మెగాస్టార్‌' అన్న పేరే పెద్ద పబ్లిసిటీ. దాని చుట్టూ ఈ ప్లానింగ్స్‌ అదనపు బోనస్‌ అవ్వాలి. చిరంజీవి 151వ సినమాగా తెరకెక్కుతోంది ఈ సినిమా. భారీ తారాగణంతో, అత్యంత భారీ బడెక్జట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. బిగ్‌బీ అమితాబ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే టైటిల్‌ అనౌన్స్‌ చేశారు. టైటిల్‌కి మెగా రెస్పాన్స్‌ వస్తోంది. టైటిల్‌తో పాటు ప్రధాన తారాగణం పేర్లను కూడా రివీల్‌ చేసింది చిత్ర యూనిట్‌. 2018 సమ్మర్‌లో సినిమాని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'సైరా నరసింహారెడ్డి'.

ALSO READ: అర్జున్ రెడ్డి పై ట్వీట్ కొట్టిన కేటీఆర్ & సమంతా