ENGLISH

పూరీ ఆ డైలాగ్‌ ఎందుకు రాశాడంటే..

28 August 2017-14:20 PM

పూరీ - బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'పైసా వసూల్‌'. ఈ సినిమా టీజర్స్‌లోని డైలాగ్స్‌తో బాలయ్య ఇప్పటికే రచ్చ రచ్చ చేస్తున్నారు. మాస్‌కి బాగా రీచ్‌ అయిపోయాయి ఆ డైలాగులు. టీజర్స్‌తోనే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక సినిమాలోని డైలాగులు ఏ స్థాయిలో పేలనున్నాయో అంటూ బాలయ్య అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ని ఎందుకు రాశారో పూరీ చెబుతూ, రామకృష్ణా ధియేటర్‌ సందుల్లో నేనే తిరిగాను. ఆ స్పూర్తితోనే ఆ డైలాగ్‌ బాలయ్య చేత చెప్పించాను.. అంటూ పూరీ చెప్పడం విశేషం. 'పైసా వసూల్‌' ఆడియో సక్సెస్‌ కార్యక్రమం హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు గెస్ట్‌గా విచ్చేశారు. ముద్దుగుమ్మలు శ్రియ, ఛార్మి, కైరాదత్‌లు తమ అంద చందాలతో ఈ కార్యక్రమానికి ఎక్స్‌ట్రా గ్లామర్‌ అద్దారు. బాలయ్య కెరీర్‌లో ఈ సినిమా తప్పకుండా ఓ మంచి విజయంగా నిలుస్తుందనీ, మోహన్‌బాబు అన్నారు. అలాగే ఈ సినిమాతో బాలయ్య అన్నగారు ఎన్టీఆర్‌ని తలపిస్తున్నారనీ అన్నారు. డాన్సుల్లో ఇంతవరకూ ఎప్పుడూ బాలయ్య స్వర్గీయ ఎన్టీఆర్‌ని ఇమిటేట్‌ చేయలేదు. కానీ పూరీ ఈ సినిమాలో ఫ్యాన్స్‌కి ఆ లోటు తీర్చేశారు. ఓ సాంగ్‌లో బాలయ్య, స్వర్గీయ ఎన్టీఆర్‌ స్టెప్పులతో సందడి చేయడం నందమూరి ఫ్యాన్స్‌ని ఆనందోత్సాహాల్లో ముంచేస్తోంది. సెప్టెంబర్‌ 1న 'పైసా వసూల్‌' విడుదల కానుంది. ఇక అందుకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయిపోయినట్లే.

ALSO READ: ఎన్టీఆర్ కోసం తమన్నా స్పెషల్!