ENGLISH

మరో సంచలనానికి తెర లేపిన హాట్‌ బ్యూటీ!

10 August 2019-08:30 AM

టాలీవుడ్‌లో చేసినవి రెండే సినిమాలైనా ఇక్కడి హీరోలు, హీరోయిన్స్‌ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారంటూ ఆరోపణలు చేసి, సంచలనం సృష్టించింది. తాను నటించిన కొన్ని సినిమాలకు సంబంధించి కూడా అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసి, హాట్‌ టాపిక్‌ అవుతూ ఉంటుంది. న్యూడ్‌ షోలు, సెమీ న్యూడ్‌ షోలతో వివాదాలకెక్కింది. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఈ పాటికి మీకే అర్ధమైపోయి ఉంటుంది. వివాదాలకు కేరాప్‌ అడ్రస్‌ అయిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం హాలీవుడ్‌లో 'వెడ్డింగ్‌ గెస్ట్‌' అనే సినిమాలో నటిస్తోంది.

 

ఈ సందర్భంగా బాలీవుడ్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది. తనదైన స్టైల్‌లో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేసింది. ఇంతకీ రాధికా ఆప్టే సెలవిచ్చిన ఆ కొత్త హాట్‌ న్యూస్‌ వివరాల్లోకి వెళితే, బాలీవుడ్‌ నిర్మాతలు డబ్బులు సరిగ్గా ఇవ్వరనే సంకేతాలు పంపించింది తన మాటల ద్వారా. హాలీవుడ్‌లో రెమ్యునరేషన్‌ గురించి చెబుతూ, ఇక్కడి వారిలా హాలీవుడ్‌లో రెమ్యునరేషన్‌కి అస్సలు ఇబ్బంది పెట్టరని, ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ కాగానే వెంటనే డబ్బులిచ్చేస్తారనీ, లెక్క పక్కాగా ఉంటుందని చెప్పింది.

 

అంటే ఆమె ఏం చెప్పాలనుకుందో ఆ మాటని జనానికి అర్ధమయ్యేలా ఇలా చెప్పిందన్నమాట. హాలీవుడ్‌లో పేమెంట్‌ పక్కాగా ఉంటుంది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఎగ్గొట్టేస్తారనే మాటను కర్ర విరక్కుండా, పాము చావకుండా అంటారే.. అలా సెలవిచ్చింది రాధికా ఆప్టే. ఈ హాట్‌ కామెంట్‌తో రాధికా ఆప్టే ఎంత సెన్సేషన్‌ అవుతుందో చూడాలిక.

ALSO READ: మెగా హీరోలతో ఢీ కొడుతున్న నాని..!