ENGLISH

రాజ్ తరుణ్ ఈసారి హిట్ కొట్టేలా వున్నాడు!

07 March 2022-14:25 PM

రాజ్ త‌రుణ్ ప్రతిభావంతుడు. త‌న కెరీర్‌లో మంచి క‌థ‌లు ఎదురొచ్చాయి. దాంతో వ‌రుస‌గా హిట్లు కొట్టాడు. అయితే ఆ త‌ర‌వాత అదృష్టం బాగాలేకో, లేదా కథని సరిగ్గా అంచన వేయలేకో చెప్పలేం కానీ గాడి త‌ప్పేశాడు. వరుసగా అపజయాలు. రాజుగాడు, రంగులరాట్నం, లవర్, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే .. ఇలా వరుస అపజయాలే. చివరికి అన్నపూర్ఱ స్టూడియోస్ లాంటి బ్యాన‌ర్‌లో చేసిన అనుభవించు రాజా కూడా దొబ్బకొట్టేసింది.

 

అయితే ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నాడు రాజ్ తరుణ్. తనకు బాగా కలిసొచ్చిన యూత్ ఫుల్ జోనర్ .. ఓ కథని చేస్తున్నాడు. అదే 'స్టాండప్‌ రాహుల్‌’. వర్ష బొల్లమ్మ హీరోయిన్. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. చాలా ప్రామెసింగా అనిపించింది. వినోదం, సెంటిమెంట్ చక్కగా కుదిరింది. వర్ష, రాజ్ ల జోడి కూడా కొత్తగా అనిపించింది. పెళ్ళా, సహజీవనం చూట్టు తిరిగే ఈ కథ యూత్ కి కనెక్ట్ అయ్యేలా వుంది. చాలా రోజులు గా ఓ హిట్ కోసం చూస్తున్నాడు రాజ్ తరుణ్. ఆ హిట్ స్టాండప్‌ రాహుల్‌తో పడే ఛాన్స్ ట్రైలర్ లో పుష్కలంగా కనిపిస్తుంది. మార్చి 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: డైలామాలో ప్ర‌భాస్ సినిమా