ENGLISH

ట్రెండింగ్ లో మహేష్ -రాజమౌళి టైటిల్

16 February 2024-13:57 PM

రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో మూవీ అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి సంబధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరలవుతోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ మూవీ ఉంటుందని ఇప్పటికే  మేకర్స్ పలు మార్లు పేర్కొన్నారు. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ కోసం మహేష్ బాబు అల్ రెడీ తన బాడీ మేకోవర్ పరంగా కసరత్తులు ప్రారంభించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం SSMB కి  'మహా రాజా' అనే  టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
 

అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నఈ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇది నిజమా కాదా అన్నది ఇంకా కన్ఫర్మ్ అవకముందే ఈ టైటిల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.  మహేష్ ఫాన్స్ కూడా ఈ టైటిల్ కే ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే మహేశ్ కెరీర్‌లో ‘రాజకుమారుడు’, ‘యువరాజు’లాంటి సినిమాలు ఉన్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకు  అలాంటి టైటిల్‌తో మహేశ్ సినిమా రానుంది అని ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మహేష్, రాజమౌళి పేర్లలోని మొదటి మూడు అక్షరాలా కలయికతో ఈ టైటిల్ వచ్చేలా సెట్ చేశారని టాక్.
 

ఈ మూవీలో మొదటిసారిగా మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుందని సమాచారం. మహేష్ క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అప్పుడే  టైటిల్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో, చూడాలి.  ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయ్యిందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని సమాచారం. మహేష్ కోసం ఒక ఇండోనేషియన్ నటిని ఫిక్స్ చేసారు.