ENGLISH

ప్రజల కోసం ‘చిరు’ ప్రయత్నం చేసిన రాజమౌళి-ఎన్టీఆర్

28 August 2017-14:51 PM

హైదరాబాద్ లో రోజురోజుకి అధికమవుతున్న సైబర్ నేరాలని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ పోలీసులు బాధ్యతగా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా కొన్ని లఘుచిత్రాలని రూపొందించింది.

వీటిని ముఖ్యంగా టెక్నాలజీని ఆధారం చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వారినుండి సామాన్య ప్రజలని భయటపడేసే క్రమంలో వీటి ద్వారా ప్రచారం చేయనున్నారు. అయితే వీటికి జనాదరణ కలిగిన వారి చేత వీటికి వాయిస్ ఓవర్ ఇప్పిస్తే ఇవి త్వరగా ప్రజల్లోకి వెళతాయి అని ఆలోచించి ఎన్టీఆర్, రాజమౌళి ని సంప్రదించారట.

పొలిసు వారు అడిగిన వెంటనే ఈ ఇద్దరు తమ గాత్రాన్ని ఈ లఘుచిత్రాలకి జోడించటం జరిగింది అని తెలిసింది. ఇక త్వరలోనే ఈ లఘుచిత్రాలని హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించనున్నారు.

 

ALSO READ: అర్జున్ రెడ్డి పై ట్వీట్ కొట్టిన కేటీఆర్ & సమంతా