ENGLISH

మహేష్ తర్వాత.. రాజమౌళి సినిమా ఎవరితో..?

03 January 2024-14:59 PM

పాన్ ఇండియా స్టార్లే కాదు, పాన్ ఇండియా డైరక్టర్స్ కూడా ఉన్నారు. వీరి అందరిలో రాజ మౌళి టాప్ లో ఉన్నారు. జక్కన్న RRR తరవాత మహేష్ తో ఒక మూవీ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మూవీ సీక్వెల్ గా రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కక ముందే, జక్కన్న  నెక్స్ట్ ప్రాజెక్ట్ వార్తలు వస్తున్నాయి. 


రాజమౌళి సినిమా అంటే రికార్డుల వేట అని తెలిసిందే. ఈగతో కూడా సినిమా చేసి హిట్ కొట్టిన ఘనుడు రాజ మౌళి. అందుకే రాజమౌళి లాంటి డైరెక్టర్ తో వర్క్ చేయటాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. మహేష్ మూవీ తరవాత రాజమౌళి తమిళ స్టార్ హీరో సూర్యతో  సినిమా చేస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


మగధీర సినిమా తరవాత సూర్యతో ఒక సినిమా చేయాల్సి ఉందని, కానీ ఆ సినిమా ఇప్పటివరకు వర్కౌట్ కాలేదని సమాచారం. అందుకనే మహేష్ మూవీ అయిన వెంటనే సూర్యతోనే రాజమౌళి సినిమా అని,  సూర్య కూడా ఇందు కోసం వెయిట్ చేస్తున్నారని టాక్.  ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి మరి.