ENGLISH

ఆగిపోయిన సినిమాని మ‌ళ్లీ క‌దిలిస్తున్న ర‌జ‌నీ

29 January 2021-09:10 AM

చిన్నా - చితకా హీరోల సినిమాలు షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోయాయంటే అది స‌హ‌జ‌మే. స్టార్ హీరో సినిమా, సూప‌ర్ స్టార్ సినిమా, షూటింగ్ ద‌శ‌లో ఆగిపోవ‌డం, ఆర్థిక ఇబ్బందుల‌లో చిక్కుకోవ‌డం చాలా అరుదైన విష‌యం. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్‌లోనూ అలాంటి సినిమా ఒక‌టి వుంది. అదే.. `రానా`. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ భారీ బ‌డ్జెట్ సినిమా.. కొంత మేర షూటింగ్ జ‌రుపుకుని ఆగిపోయింది. ఇక ఆ సినిమా మొద‌ల‌వ్వ‌ద‌ని, ఆ సినిమా కోసం ప‌డిన క‌ష్టం, పెట్టిన పెట్టుబడి రెండూ వృథానే అనుకున్నాయి కోలీవుడ్ వ‌ర్గాలు.

 

అయితే అనూహ్యంగా `రానా`పై మ‌ళ్లీ దృష్టి పెట్టాడ‌ట ర‌జ‌నీకాంత్. ఈ సినిమాని ఎలాగైనా పూర్తి చేయాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని కె.ఎస్‌.ర‌వికుమార్ సైతం ధృవీక‌రించారు. ``నేను రజనీకాంత్ సార్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాను. ఆరు నెలల క్రితం నేను `రానా` స్క్రిప్ట్‌ను మరోసారి వివరించాను. ఆయ‌న‌ దానిని పూర్తిగా ఇష్టపడ్డారు. ర‌జ‌నీ కోలుకున్న తర్వాత దీన్ని చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను` అన్నారాయ‌న‌. మొత్తానికి `రానా` బండి క‌దులుతున్న‌ట్టే... 2021లోనే ఈ సినిమా ని పునః ప్రారంభించే అవ‌కాశాలున్నాయి.

ALSO READ: న‌రేష్ సినిమాకి ఎన్ని కోట్ల న‌ష్టం?