ENGLISH

హాస్పిటల్‌లో రజనీకాంత్‌.. అసలేమయ్యింది.?

26 December 2020-09:30 AM

రజనీకాంత్‌ ఇటీవల అర్థారంతరంగా తన తాజా చిత్రం 'అన్నాత్తె' షూటింగ్‌ మధ్యలో ఆపేసుకుని, హైద్రాబాద్‌ నుంచి చెన్నయ్‌ వెళ్ళిపోయిన విషయం విదితమే. ఈ నెలాఖరున రజనీకాంత్‌ తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీ వివరాల్ని వెల్లడించాల్సింది. ఇంతలోనే, షూటింగ్‌ సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో, ఆ సినిమా షూటింగ్‌ని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. రజనీకాంత్‌కి కూడా కరోనా టెస్టులు చేశారుగానీ, వాటిల్లో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది.

 

'హమ్మయ్యా..' అని అంతా అనుకుంటున్న తరుణంలో రజనీకాంత్‌, చెన్నయ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. దాంతో అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే, కరోనా లక్షణాలేమీ రజనీకాంత్‌కి లేవనీ, రక్త పోటు కాస్త ఇబ్బందికరంగా మారిందని వైద్యులు వెల్లడించారు. రక్తపోటు తిరిగి సాధారణ స్థితికి రాగానే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు పేర్కొన్నారు. రజనీకాంత్‌ కొన్నాళ్ళ క్రితం తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆయనకు విదేశాల్లో వైద్య చికిత్స అందించారు. అనంతరం రజనీకాంత్‌ కోలుకున్నారు.

 

అయితే, అప్పట్లో ఆయనకు వైద్య చికిత్స జరిగింది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ నిమిత్తమేనని ఇటీవల తేలింది. తన ఆరోగ్య పరిస్థితిని రజనీకాంత్‌ ఇటీవల ప్రకటించడంతో అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారు. కరోనా నేపథ్యంలో కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా వుండాల్సిందే. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్‌, రాజకీయ రంగ ప్రవేశం సాధ్యమయ్యే పనేనా.? అనే ఆందోళన అభిమానుల్లో పెరిగిపోయింది.

ALSO READ: రష్మిక ఇకపై టాలీవుడ్‌కి చిక్కదా.?