ENGLISH

వేట్టయాన్ మూవీ రివ్యూ & రేటింగ్‌

10 October 2024-15:11 PM

చిత్రం: వేట్టయాన్
దర్శకత్వం: టీజే జ్ఞాన‌వేల్‌
కథ - రచన: టీజే జ్ఞాన‌వేల్‌


నటీనటులు: ర‌జినీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫాహ‌ద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్. 


నిర్మాత: సుభాస్క‌ర‌న్‌


సంగీతం: అనిరుద్ ర‌విచంద‌ర్‌
సినిమాటోగ్రఫీ: ఎస్‌ఆర్‌ క‌దిర్‌
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్‌


బ్యానర్: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
విడుదల తేదీ: 10 అక్టోబర్ 2024 
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5

 

ఇప్పటికీ రజనీ కాంత్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు. యూత్ కి సమానంగా పోటీ పడుతూ ఏడు పదుల వయసులో కూడా  పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. జైలర్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తలైవా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. సీనియర్ దర్శకులకంటే కొత్తవారే బెటరని వారితో సినిమాలు చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జై భీం లాంటి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చేసిన జ్ఞానవెల్ కి రజనీ అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వచ్చిందే 'వేట్టయాన్'. ఈ మూవీ దసరా సందర్భంగా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. వేట్టయాన్ ఎలా ఉందో, రజనీ కి జైలర్ లాంటి హిట్ అందించిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.  

 

కథ:

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అథియన్ (రజనీకాంత్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. సత్యదేవ్ బ్రహ్మదత్ పాండే (అమితాబ్ బచ్చన్) సుప్రీం కోర్టులో పనిచేసే న్యాయమూర్తి. చెన్నైలో ఓ కీలక కేసు దర్యాప్తు కోసం ఎస్పీ హరీష్ కుమార్ (కిషోర్), ఏఎస్పీ రూపా (రితికా సింగ్)లతో ఓ సిట్‌ను ఏర్పాటు చేస్తారు. కానీ అథియన్ ఆ కేసులోకి వచ్చి గుణ అనే నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాడు. అథియన్ చేసిన ఎంకౌంటర్ వలన ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సత్యదేవ్, అథియన్ మధ్య విభేదాలకు కారణమేంటి ? ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అయిన అథియన్ ను ఎందుకు తప్పించారు? సిట్ ఏర్పాటు తర్వాత కేసు విచారణ ఎలా సాగింది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో అథియన్ మళ్లీ ఎందుకు చేరాడు? ఈ కోర్టు డ్రామాలో నటరాజ్ (రానా దగ్గుబాటి) క్యారెక్టర్ ఏంటి? ఈ కేసులో డీజీపీ శ్రీనివాస్ (రావు రమేష్) పాత్ర ఏంటి? అథియన్ చేసిన ఎన్ కౌంటర్ సరైనదేనా? ఎన్ కౌంటర్ అధియన్ జీవితాన్ని ఎలా కుదిపేసింది? అనే సమాధానాలు కోసం 'వేట్టయాన్' చూడాల్సిందే. 

 

విశ్లేషణ:

ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఒక ఎన్ కౌంటర్ లో జరిగిన నిజా నిజాలు తెలుసుకోవటానికి ఒక ఇన్వెస్ట్ గేషన్ ఏర్పాటు చేస్తారు. ఆ ఇన్వెస్ట్ గేషన్ లో నమ్మలేని నిజాలు బయట పడతాయి. జై భీం లాంటి మంచి సందేశాత్మక చిత్రం తీసిన జ్ణానవేల్ ఇప్పుడు పూర్తి భిన్నమైన కథని ఎంచుకున్నారు. అంతే కాదు స్టార్ క్యాస్టింగ్ కూడా తీసుకున్నారు. అన్ని భాషల నటుల్ని ఇందులో తీసుకోవటం గమనార్హం. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లేతో అలరించిన జ్ఞానవేల్ సెకండ్ ఆఫ్ మొత్తం ఎమోషన్స్ చూపించారు. కానీ ఇవి అంతగా రక్తి కట్టలేదు. రజనీ మార్క్ నటన కి స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినా ఉన్నంతలో మెప్పించారు. కొంచెం మెసేజ్ ఇచ్చాడు ఈ మూవీతో దర్శకుడు.                         


స్టార్ క్యాస్టింగ్ ని తీసుకోవటమే కాదు వారికి నటన కి ఆస్కారమున్న పాత్రలు ఇచ్చారు.  హ్యుమన్ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సమాజంలోని ఉన్న ఒక సమస్యను పోలీసులు, కోర్టు మధ్యలో నలిగేలా రాసుకొచ్చాడు. ప్రేక్షకుడ్ని ఆలోచనలో పడేసేలా ఉంది   జ్ఞాన‌వేల్‌ కథ. ఒక మెసేజ్ ని  కమర్షియల్‌గా చెప్పాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా నచ్చే  విధంగా ఉంది. జై భీం మూవీని ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా తీసి ఆడియన్స్ మనసు గెల్చుకున్న జ్ఞానవేల్ ఈ సారి కేవలం అవార్డులు మాత్రమే కాకుండా, వసూళ్లు రాబట్టే విధంగా ఈ సినిమా తెరకెక్కించారు.    

 

నటీ నటులు:

రజనీకాంత్ నటనకి వంకలు పెట్టడానికి ఏముంటుంది. రజనీ స్టైల్, నటన, స్క్రీన్ ప్రజెన్స్‌ అన్ని అక్కట్టుకునేలా ఉన్నాయి. సినిమా చూస్తేనే రజనీ నటనని ఆశ్వాదించగలము. రజనీ  ఈ ఏజ్ లో కూడా ఇంత యాక్టీవ్ గా ఉండటం గ్రేట్ అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ పాత్ర హుందాగా ఉంది. ఆ పాత్రకి అమితాబ్ తన నటనతో మరింత డిగ్నిటీ తీసుకు వచ్చారు. కొన్ని సీన్స్ లో రజనీ కాంత్, అమితాబ్ పోటాపోటీగా నటించారు. వీరిద్దరి కాంబో సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. రానా, ఫహాద్ తన పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. మంజు వారియర్ కి ఒక్క పాట తప్ప పెద్దగా నటనకి అవకాశమున్న పాత్ర దొరకలేదు. దుషారా కి మంచి పాత్ర దక్కింది. రితికా సింగ్ గెస్ట్ పాత్రలా ఒకటి రెండు సీన్ లకే పరిమితం అయ్యింది.           

 

టెక్నికల్ :

దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉన్నా, కొంత గందర గోళంగా అనిపించింది. జై భీం సినిమాలో ఎమోషన్స్ తో కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసిన జ్ఞానవేల్, ఈ మూవీలో తడబడ్డాడు. ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేసినా, అవి ఆడియన్స్ కి కనక్ట్ అవ్వవు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. అనిరుద్ ఇచ్చిన బీజీఎంతో కొని సీన్స్ హైలెట్ అయ్యాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఫైట్స్ టీమ్ వర్క్ బాగుంది. లైకా ప్రొడక్షన్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.   

 

ప్లస్ పాయింట్స్

రజనీ కాంత్ 
మిగతా నటులు 
అనిరుద్ మ్యూజిక్ 
ఫస్ట్ హాఫ్ 

 

మైనస్ పాయింట్స్

కనక్ట్ కానీ ఎమోషన్స్ 
సాగదీత సీన్స్ 
సెకండ్ హాఫ్ 

 

ఫైనల్ వర్దిక్ట్ : రజనీ మార్క్ ఎన్కౌంటర్..
 

ALSO READ: IN ENGLISH