ENGLISH

రకుల్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా!

06 August 2020-09:04 AM

ఈతరం హీరోయిన్లందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారే. ఫేస్ బుక్, ట్విటర్లతో పాటు ఇన్స్టా గ్రామ్ లో కూడా చాలామందికి ఖాతాలు ఉన్నాయి. ఇక రకుల్ ప్రీత్ లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్ల సంగతి చెప్పనక్కర్లేదు. తాజాగా రకుల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ విషయంలో ఓ మైలురాయిని చేరింది.

 

రకుల్ ఫాలోయర్ ల సంఖ్య 15 మిలియన్ల దాటింది. దీంతో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను షేర్ చేసింది రకుల్. ఆ వీడియోతో పాటు క్యాప్షన్లో తన మనసులోని భావాలను కూడా పంచుకుంది. "15 మిలియన్లు. చాలా చిన్న వయసులోనే నేను పని చేయడం ప్రారంభించాను అప్పట్లో నాకు వర్క్ గురించి పెద్దగా తెలియదు. సోషల్ మీడియా పట్ల కూడా పెద్దగా అవగాహన లేదు. కానీ మీరందరూ ఆపై ఎంతో ప్రేమ కురిపించారు. నేనెప్పుడూ దానికి ఋణపడి ఉంటాను. నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చేమో కానీ ఇంకా కష్టపడతానని, మీ అందరినీ అలరిస్తారని మాత్రం హామీ ఇవ్వగలను. ఇన్స్టాగ్రామ్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. లవ్ యు ఆల్."

 

ఇక రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా మరో తమిళ చిత్రంలోనూ, రెండు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

ALSO READ: Rakul Preet Singh Latest Photoshoot