ENGLISH

సుకుమార్‌ లెక్కేస్తే అంతే మరి.!

05 April 2018-08:00 AM

లెక్కల మాస్టారు కదా. ఆ లెక్క తన సినిమాల్లో కూడా అక్కడక్కడా చూపించడం మర్చిపోడు. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో హీరో ఎన్టీఆర్‌తో లెక్కలు వేయించినట్లే, పల్లెటూరి కుర్రాడైనా చిట్టిబాబుతో కూడా 'రంగస్థలం'లో లెక్కలేయించడం మర్చిపోలేదు మనోడు. స్టార్టింగ్‌లో పామును పట్టుకునే సన్నివేశంలో చిట్టిబాబు లెక్కలేయడం దగ్గర మన లెక్కల మాస్టారు ఆర్ట్‌ చక్కగా కనిపించింది. 

ఇకపోతే గతంలో అల్లు అర్జున్‌తో హిట్‌ కొట్టాడు. ఎన్టీఆర్‌తో 'నాన్నకు ప్రేమతో' సినిమాతోనూ సూపర్‌ హిట్‌ కొట్టాడు. చరణ్‌తో ఏకంగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి సుకుమార్‌ సత్తా అంటే ఇది అని చూపించాడు. ఇక ఇప్పుడు సుక్కు కన్ను ప్రబాస్‌ మీద పడిందట. ప్రబాస్‌తో ఓ సినిమా చేయాలనుందన్న తన మనసులోని కోరికను 'రంగస్థలం' ప్రమోషన్స్‌లో సుకుమార్‌ బయటపెట్టాడు. అంటే త్వరలోనే ప్రబాస్‌తో సుకుమార్‌ సినిమా ఖాయమని తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా, ఆల్రెడీ సుకుమార్‌ని చరణ్‌ లాక్‌ చేసినట్లు ఓ సమాచారమ్‌. అది తన తండ్రి చిరంజీవి కోసమనీ టాక్‌ వినిపిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడట. 'రంగస్థలం' షూటింగ్‌ టైంలోనే చరణ్‌ సుకుమార్‌ దగ్గర మాట తీసుకున్నాడట. సుకుమార్‌ కూడా అందుకు ఓకే అన్నాడనీ టాక్‌ వినిపిస్తోంది. చూడాలి మరి సుకుమార్‌ లెక్క ఎలా వేశాడో.

ALSO READ: నేను చనిపోయాక కూడా నటిస్తా: బాబూమోహన్