ENGLISH

దాయాది దేశానికీ పాకిన చెర్రీ క్రేజ్

08 March 2024-14:15 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. RRR వరకు ఒక లెక్క, RRR తరువాతా ఒక లెక్క. చెర్రీ ఇప్పుడు టాలీవుడ్ యాక్టర్ కాదు పాన్ వరల్డ్ యాక్టర్.  రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో చెర్రీ 'రామరాజు' పాత్రలో చూపించిన వేరియేషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. చెర్రీ పోషించిన రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ ఎంతలా ఇన్స్పిరేషన్ చేసింది అంటే, ఈ మధ్య కాలంలో హాలీవుడ్ లో ఒక సినిమాలో పోలీసు పాత్ర కోసం కొన్ని గెటప్స్, వేరియేషన్స్ చూపిస్తూ చరణ్ ఫోటో కూడా వేయటం గమనార్హం. ప్రపంచం మొత్తాన్ని తమ సినిమాలతో ఆకట్టుకునే  హాలీవుడ్ మేకర్స్ కూడా జక్కన్న డిజైన్ చేసిన చెర్రీ పాత్రకి ఫిదా అయ్యారు. చెర్రీ కూడా తన నటనతో జీవం పోసాడు. ఈ క్యారక్టర్ లో చెర్రీని తప్ప ఇంకెవర్నీ ఊహించలేము.


ఈ మూవీలో ఒక సందర్భంలో వేలమంది జనాల మధ్యలోకి దూకి రామ్ చరణ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ తో  సీటిమార్ కొట్టించాయి. అంతే కాదు మన దాయాది దేశమైన పాకిస్తాన్ లో కూడా ఈ యాక్షన్ సీన్స్ లో చరణ్ నటనకి నీరాజనాలు పడుతున్నారని అర్థం అవుతోంది. రీసెంట్ గా ఈ యాక్షన్ సీన్ గురించి, రామ్ చరణ్ నట విశ్వరూపం గూర్చి పాకిస్తాన్ మీడియాలో చర్చ జరగటం విశేషం. పాకిస్తాన్ కి చెందిన ఓ ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా డిస్కషన్  జరిగింది. “రామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ వేలమంది మధ్యలోకి దూకి ఫైట్ చేసి, మళ్ళీ తిరిగి వచ్చి అదే పొజిషన్ లో నిలబడడం మైండ్ బ్లోయింగ్ అనిపించింది” అంటూ ప్రశంసించారు.


పాకిస్థాన్ లో హిందీ సినిమాలకి, హిందీ హీరోలకే  ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారికి సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. అలాంటిది టాలీవుడ్ సినిమా, టాలీవుడ్ హీరో గూర్చి పాక్ మీడియాలో చర్చ జరగటం అంటే సాధారణ విషయం కాదు. ఏదయినా కానీ చెర్రీ తండ్రిని మించిన తనయుడు అయ్యాడు అంటంలో సందేహం లేదు. ఈ వీడియోని చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.