ENGLISH

రామ్ చ‌ర‌ణ్ సినిమా టైటిల్ అదేనా?

09 March 2022-12:00 PM

రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కైరా అద్వాణీ క‌థానాయిక‌. దిల్ రాజు నిర్మాత‌. ఆయ‌న బ్యాన‌ర్‌లో రూపుదిద్దుకుంటున్న 50వ చిత్ర‌మిది. అందుకే చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ ఐఏఎస్‌గా న‌టించ‌నున్నాడు. ఆ త‌ర‌వాత ముఖ్య‌మంత్రి అవుతాడు. అదెలా అన్న‌దే క‌థ‌. ఈ చిత్రానికి `స‌ర్కారోడు` అనే టైటిల్ ఖ‌రారు చేశార‌ని వార్త‌లొస్తున్నాయి. అయితే... చిత్ర‌బృందం ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. అంజ‌లి, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎస్‌.జె.సూర్య ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. సూర్య‌కీ, చ‌ర‌ణ్‌కీ ఉన్న లింకేంటి? ఇద్ద‌రూ ఎందుకు గొడ‌వ ప‌డాల్సివ‌చ్చింది? అనే విష‌యాలు క‌థ‌లో చాలా కీల‌క‌మ‌ని తెలుస్తోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. 2023 సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ALSO READ: పెద్ద సినిమాలకి పండగ