ENGLISH

డబుల్ ఇస్మార్ట్... మాస్ కలక్షన్స్

23 August 2024-14:40 PM

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' ఆగస్టు 15 న రిలీజ్ అయ్యింది.  విడుదలకు ముందే పాటలు కి మంచి ఆదరణ దక్కింది. మణిశర్మ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడు. 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్‌గా డబల్ ఇస్మార్ట్ రూపొందిన సంగతి తెల్సిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం, లాంగ్ వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. 60 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పాజిటీవ్ ఓపెనింగ్స్  అందుకుంది.  


ఫస్ట్ డే బాక్సాఫీస్ కలక్షన్స్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. డబుల్ ఇస్మార్ట్ కి పోటీగా మిస్టర్ బచ్చన్ కూడా దిగినా 45% టూ  50% ఆక్యుపెన్సీ సాధించింది.  పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాకి కర్ణాటక, హిందీ ప్రాంతాల్లో అంతగా టాక్ రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మొదటి రోజు వసూళ్లలో రామ్ కెరీర్‌లోనే ఇదే బెస్ట్ కలక్షన్  అని చెప్పుకోవచ్చు.  నైజాం లో 2.49 కోట్లు. సీడెడ్ 90లక్షలు, ఉత్తరాంధ్ర 76లక్షలు, తూర్పు గోదావరి 44లక్షలు, పశ్చిమ గోదావరి 23లక్షలు, గుంటూరు 70లక్షలు, కృష్ణా 38లక్షలు, నెల్లూరు 20లక్షలు, వసూళ్లు చేసింది.  


ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మొత్తం కలిపి 6.10 కోట్లు, కర్ణాటక + ROI 65 లక్షలు,ఓవర్సీస్ 55 లక్షలు, కలక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే షేర్ వాల్యూ 7.30 కోట్లు. టోటల్ గా 12.45  గ్రాస్ కలక్షన్స్ తో దుమ్ము లేపుతోంది. డబుల్ ఇస్మార్ట్  కి పోటీగా తంగలాన్, మిస్టర్ బచ్చన్, ఆయ్ లాంటి సినిమాలున్నా రామ్ మూవీ  ఈ స్థాయి కలెక్షన్స్ అందుకుంది. రామ్ మాస్ యాక్షన్, పూరి క్రేజ్ రెండూ ఈ వసూళ్లు కురిపించాయి. బీ, సీ సెంటర్లలో  ఇస్మార్ట్ కి మంచి కలక్షన్స్ వచ్చాయి. వరస హాలిడేస్ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ ఈజీగా 20 కోట్లుకి చేరుకుంటుందని అంచనా.